పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే.
Workplace Harassment: బెంగళూరు నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని టాయిలెట్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన కలకలం రేపుతుంది. సోమవారం నాడు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.
YS Jagan: ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాజీ సీఎం, వైస్సార్సీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో చంద్రబాబు గారు.. అంటూ, అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారికి ఆపాదిస్తూ వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా సాక్షి యూనిట్ ఆఫీసులమీద ఒక పథకం ప్రకారం దాడులు చేయించారు. ఈ అరాచకానికి…
గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో అని పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరోపించారు.
రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు.. జే బ్రాండ్ తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు.. అలాగే, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అని సీఎం చంద్రబాబు అన్నారు.
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన “హెడ్-టు-హెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా.. వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి కంటెస్టెంట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని…
KSRTC Conductor: భారతదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్రయాణాలలో ఇలా అనేకచోట్ల జరుగుతున్న సంఘటనలు మహిళల పట్ల దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. మంగళూరు నగరానికి ముడిపు నుంచి వస్తున్న బస్సులో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బస్సు కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తిని ప్రదీప్ కశప్ప నాయక్‌గా గుర్తించారు. ప్రయాణిస్తున్న మహిళ…
Stree Summit 2.0: హైదరాబాద్ నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్ వేదికగా స్త్రీ సమ్మిట్ 2.0 – 2025 కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ అవగాహన సదస్సులో మహిళల భద్రత, చిన్నపిల్లల రక్షణ, సైబర్ సెక్యూరిటీ,…
మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్టు చేయించామని తెలిపారు. ఇలాంటి పైశాచికంగా ఆనందపడే పనులకు ప్రభుత్వంలో చోటు లేదని…
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల టీడీపీ-జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పే వారే, వారికి ఇచ్చిన హామీలను వదిలేసినప్పుడే వారి నిజమైన స్వభావం బయటపడిందని మండిపడ్డారు. రాజ్యంలో పోలీస్ వ్యవస్థ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’లో మునిగిపోతోందని, మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ…