Sabitha Indra Reddy: మేడ్చల్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో మహిళపై అత్యాచారయత్న ఘటనపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు. మహిళ కోచ్ లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచారం యత్నం చేశాడు.. ఆగంతుకుడు నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ట్రైన్ లోపలి నుంచి కిందకు దూకింది అని పేర్కొనింది. అమ్మాయికి గాయాలు పాలై చికిత్స కొనసాగుతుంది.. బస్సులో, ట్రైన్స్ లో కూడా మహిళలు భద్రత కరువైంది అని ఆరోపించింది. మహిళలపై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22 శాతం పెరిగినట్లు పలు నివేదికలు చెపుతున్నాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపింది.
Read Also: Minister Komatireddy: సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్..
అయితే, మహిళల భద్రతపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలి అని సబితా ఇంద్రా రెడ్డి డిమాండ్ చేసింది. తక్షణమే బాధితురాలని ప్రభుత్వం ఆదుకోవాలి అన్నారు. ఇక, రాష్ట్రంలో షీ టీమ్స్ ఏమి చేస్తున్నాయి.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజకీయ వేదిక చేశారు.. వెంటనే, కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీసులకు వదిలేయాలి అన్నారు. లక్ష కెమెరాలు కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ చేయవచ్చు.. కానీ, సెక్రటేరియట్ లో జరగాల్సిన కార్యకలాపాలు కమాండ్ కంట్రోల్ లో చేస్తున్నారు.. కంట్రోల్ ను పోలీసులకి అప్పగించి, శాంతి భద్రతలు కాపాడాలని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించింది.