తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాల పైనే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఉదయం సాధారణ దుస్తులతో తెలంగాణ భవన్‌కు పోలీసులు వచ్చారని, ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, దిలీప్ కొణతం, మన్నె క్రిశాంక్‌లకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో లక్ష మంది పోలీసులు ఉన్నా, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉండి కూడా పరిస్థితి ఇలా ఉందని పేర్కొన్నారు.
READ MORE: OTT : ఆశ్చర్యపరుస్తున్న తమిళ సినిమాల ఓటీటీ డీల్స్
400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను కబ్జా చేసేందుకు రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని ఆరోపించారు. సుల్తాన్ బజార్‌లో చిన్నారి పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో ఇప్పటికీ నిందితుడికి శిక్ష పడలేదని చెప్పారు. కేసీఆర్ హయంలో దిశ ఎన్కౌంటర్ జరిగిందని, దిశ చట్టం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో మహిళా కమిషన్ మౌనంగా ఉందని పేర్కొన్నారు.
READ MORE: PM Modi-Yunus: మోడీ-యూనస్ భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ