ఎప్పటికప్పుడు మతంతో సంబంధం లేకుండా కొత్తగా తానే దైవం అంటూ.. బాబాలు, అమ్మవార్లు, అయ్యగార్లు.. ఇలా ఎంతో మంది పుట్టుకొస్తుంటారు.. ప్రజల వీక్‌నెస్‌ను ఆసరాగా చేసుకుని పంబం గడిపేస్తుంటారు.. చాలా మంది జేబులకు చిల్లు పడేవరకు అసలు విషయం తెలియదు.. ఆ తర్వాత ఆయ్యో మోసపోయామే అని గొల్లు మంటారు.. ప్రభుత్వం, విజ్ఞాన వేదికలు, పలు స్వచ్ఛంద సంస్థలు.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, తమిళనాడులో మరో మహిళ కొత్త…
లైంగిక వేధింపుల విషయంలో కేరళలోని ఓ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. సదరు మహిళ రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకుంటే.. అప్పుడు భారత శిక్షా స్మృతి సెక్షన్ 354-ఏ కిందకు రాదని.. అంటే లైంగిక వేధింపులు పరిగణించలేమని పేర్కొంది.. ఒక మహిళను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో రచయిత సివిక్ చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. కొందరు నెటిజన్లు కోర్టు వ్యాఖ్యలను…
కౌగిలింత అనేది మనిషిలోనే టెన్షన్‌ను దూరం చేస్తుంది అంటారు.. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా చెప్పుకునే కౌగిలింతతో.. అప్పటి వరకు ఉన్న బాధలు మరిచి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయంటారు.. లింగ బేధం లేకుండా సందర్భాన్ని బట్టి, అభినందించే సమయాన్ని బట్టి కూడా కౌగిలింతలు ఇస్తుంటారు.. అయితే, ఓ మహిళ.. కౌగిలింతపై కోర్టుకు వెళ్లడం.. కోర్టు భారీగా జరిమానా విధించడం ఆసక్తికరంగా మారింది.. కొలిగ్ తనను గట్టిగా కౌగిలించుకున్నాడని కోపగించుకున్న మహిళ.. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కారు.. ఈ…
జంతువలకు ఏదైనా జరిగితే.. వాటిని ప్రేమించే వారు చూస్తూ ఊరుకోరు.. అయితే, తాజాగా, వీధికుక్కలతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో ఒక మహిళ ఆగ్రాలో రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డును కొట్టి, అతనిపై దుర్భాషలాడారు.. ఆదివారం జరిగిన సంఘటన యొక్క వీడియో వైరల్‌గా మారడంతో ఆగ్రా పోలీసులు ఆ వీడియోను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తగా చెప్పుకునే 20 ఏళ్లకు పైగా ఉన్న ఓ మహిళ.. సెక్యూరిటీ గార్డును తిడుతూ.. కర్రతో దాడిచేసిన…
బుల్డోజర్, ఎన్‌కౌంటర్ అనగానే ఇప్పుడు వెంటనే గుర్తుకు వచ్చే నేత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్.. ఎవరైనా తప్పుచేస్తే.. ఆ ఇంటి ముందు వెంటనే బుల్డోజర్ దిగిపోతుంది.. అక్రమకట్టడాలు ఏమైనా ఉంటే కూల్చివేస్తుంది.. లేదా.. పూర్తిగా కూల్చివేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. అయితే, సీఎం యోగి.. తప్పుచేసినవాళ్లపైనే కాదు.. ప్రతిపక్షాలపై కూడా బుల్డోజర్ చర్యకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన నేతపైనే బుల్డోజర్ చర్యకు దిగడం ఆసక్తికరంగా మారింది..…
ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను ప్రేమించాలంటూ గత కొంతకాలంగా ఓ యువతిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడు.. ఆ యువతి నిరాకరించడంతో ఉన్మాదిగా మారిపోయాడు… ఆ యువతిని ఎలాగైనా మట్టుబెట్టాలనుకున్నాడు.. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో… ఢీకొట్టాడు.. తర్వాత అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.. చివరకు అసలు విషయం వెలుగు చూడడంతో.. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also:…
జన్మనిచ్చిన తల్లిదండ్రులలే కొందరు భారంగా భావిస్తున్నారు.. కనీసం వారికి తిండి పెట్టి, బాగోగులు కూడా చూసుకోకుండా ఇళ్ల నుంచి వెళ్లగొడుతున్నారు.. వారు జీవితంలో సంపాదించింది, ఆస్తులు లాగేసుకోవడమే కాదు.. మమ్మల్ని కన్నారు, పెంచి పెద్దచేశారు, విద్యాబుద్ధులు నేర్పారు, వారిని మేం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అనే జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కొందరైతే చిత్రహింసలకు గురిచేసిన ఘటనలు ఎన్నో చూశాం.. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడమే వ్యర్థమని ఇప్పటికే ఎంతో మంది పండుటాకులు రాలిపోయారు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు..…
ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు.. జీవిత ప్రయాణంలో భాగస్వాములుగా ఉండేందుకు ఒకరికొరు ప్రమాణం చేసుకున్నారు.. వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు.. అంతే కాదు.. తన ప్రేయసి కోసం.. ఆ ఇద్దరిలో ఓ మహిళ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
గజరాజుకు కోపం వస్తే ఏం జరుగుతోందో.. ఎలా ప్రవర్తిస్తోందో ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ప్రశాంతంగా ఉండే గజరాజుకు కోపం వచ్చిందంటే.. ఆపడం ఎవరితరం కాదు.. విధ్వంసం సృష్టిస్తోంది.. పంట పొలాలు, వాహనాలు, ప్రజలు, జంతువులు.. ఇలా ఏది అడ్డువచ్చినా.. అడ్డుకోవడం కష్టమే.. అయితే, తాజాగా ఓ ఏనుగు ప్రవర్తించిన తీరు మాత్రం సోషల్ మీడియాకు ఎక్కింది.. ఔరా..! ఆ గజరాజు ఎందుకు ఇలా చేశాడు..? మహిళలను తొక్కి చంపడం ఏంటి..? ఆ తర్వాత అంత్యక్రియలను కూడా…
సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు నియమాలను పాటించని పబ్ లు ఆజ్యం పోస్తున్నాయని తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆగ్రం వ్యక్తం చేశారు. తెలంగాణ NSUI బృందం శంషాబాద్ ఎయిరో ప్లాజా కాంప్లెక్స్ లోని సిప్ ఆఫ్ స్కై,చికెన్ వైల్డ్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్ ల వద్దకు తనిఖీ కోసం వెళ్లారు. అర్థరాత్రి 12 గంటలకు మూసెయ్యాల్సిన పబ్ లు ఉదయం 3 గంటలకు కూడా ఇంకా నడుస్తూనే ఉండడంతో అక్కడి పబ్ నిర్వాహకులపై…