Forged Visa: ఏజెంట్‌ను నమ్మి మస్కట్‌కు.. తెలంగాణ మహిళ అష్ట కష్టాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదనంగా డబ్బు సంపాదించి, తమ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతో మంది భావిస్తారు.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తారు.. అయితే, ఇదే సమయంలో.. కొందరు ఏజెంట్ల బారిన పడి.. నిండా మునగడమే కాదు.. జైలులో మగ్గాల్సిన పరిస్థితి.. సంపాదన లేదు.. కుటుంబానికి దూరమై.. జైలులో ఒంటరిగా మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇలా మోసపోయి జైలుకు పోయిన ఐదుగురిని మానవ హక్కుల సంఘాల ప్రతినిధుల పోరాటం కారణంగా బయటకు రాగా.. మరికొంతమంది జైలులోనే ఉన్నారు.. గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మహిళల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఏజెంట్లు.. నకిలీ వీసాలతో విమానాల్లో ఎక్కిస్తున్నారు. ఇటీవల కొచ్చి విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ సిబ్బంది పలువురు మహిళల పాస్‌పోర్ట్‌లను తనిఖీ చేసినప్పుడు ఈ నకిలీ వీసాల రాకెట్ బాగోతం వెలుగు చూసింది..
అయితే, తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన ఓ బాధితురాలి పరిస్థితి కన్నీరు పెట్టిస్తోంది.. కొత్తగూడెంకు చెందిన విజయలక్ష్మి(40) భర్తను కోల్పోవడంతో.. కుటుంబభారం తనపై పడింది.. ఆమె తల్లి పూలు అమ్మతూ జీవిస్తుండగా.. కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.. ఒంటరి తల్లి తన ఏకైక కుమారుడికి మంచి విద్యను అందించడానికి, ఉన్నతస్థానంలో ఉంచడానికి తపనపడింది.. బతుకుదెరువు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. డబ్బు సంపాదించి తన బిడ్డను పోషించుకోవడానికి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. తన బిడ్డకు అన్ని సుఖాలు ఇవ్వాలని కలలు కంది.. అయితే, అది తనను ఊహించలేని ప్రదేశానికి తీసుకెళ్తుందని ఆమెకు కూడా తెలియదు పాపం..
Also Read
మహిళలను అక్రమంగా రవాణా చేయడం మరియు గల్ఫ్ దేశాలకు తీసుకువెళ్లడం గురించి విన్నాం.. భారీ జీతాలు అంటూ వాగ్దానం చేస్తారు.. నిబంధనలు అంటూ సంతకాలు తీసుకుంటారు.. వారు దేనికి సంతకం చేశారో వారికి తెలియదు. రోజులో 14, 18 గంటల పాటు పని చేయమని వారిని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్తారు. పని తర్వాత, వారిని అద్దెకు తీసుకున్న యజమానులు వారి బ్యాంకు ఖాతాలలో డబ్బును జమ చేస్తామని వాగ్దానం చేస్తారు, కానీ, అది కూడా చాలా సార్లు జరగదని ఆరోపణలు ఉన్నాయి.. యజమానులు వారికి జీతం ఇవ్వని లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి అనుమతించని సందర్భాలు ఉన్నాయి. యజమానికి వ్యతిరేకంగా కార్మికుడు తిరగబడితే, వారి పాస్‌పోర్ట్‌లు లాక్కోవడమే కాకుండా గృహనిర్బంధంలో ఉంచిన ఘటనలు కోకొల్లలు..
విజయలక్ష్మి తన కుమారుడిక మంచి జీవితం ఇవ్వాలని భావించింది.. ట్రావెల్ ఏజెంట్ సాయంతో మస్కట్‌కు వెళ్లింది. అయితే, ఆమె వీసా గడువు తేదీని ఏజెన్సీ నకిలీది సృష్టించినందున ఒమన్‌లోని విమానాశ్రయం అధికారులు ఆమెను ఆపారు… ఆ తర్వాత ఆమెను కొచ్చికి పంపారు.. ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో రిమాండ్ చేశారు. ఏజెంట్ చేసిన మాల్ ప్రాక్టీస్‌గా పోలీసులు భావిస్తున్నారు.. ఇప్పుడు ఆమె జైలులో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు నిరీక్షించాల్సిందే.. ఆమె ఒక్కగానొక్క కొడుకు కూడా ఓదార్చలేని పరిస్థితి.. ఆమె తిరిగి వచ్చే వరకు వేచిచూడడం తప్ప మరో మార్గం లేదు.. అయితే, గుడ్డిగా ఏజెంట్లను నమ్మి విదేశాలకు వెళ్లవొద్దని.. భారత ప్రభుత్వం హెచ్చరించినా.. నిరంతరం ఇలాంటి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.. చాలా మంది ప్రజలు ఇప్పటికీ బాధితులుగా మారుతూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?