Bulldozer Action: యోగి అంటే అట్లుంటది మరి..! బీజేపీ నేత ఇంటికి బుల్డోజర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్డోజర్, ఎన్‌కౌంటర్ అనగానే ఇప్పుడు వెంటనే గుర్తుకు వచ్చే నేత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్.. ఎవరైనా తప్పుచేస్తే.. ఆ ఇంటి ముందు వెంటనే బుల్డోజర్ దిగిపోతుంది.. అక్రమకట్టడాలు ఏమైనా ఉంటే కూల్చివేస్తుంది.. లేదా.. పూర్తిగా కూల్చివేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. అయితే, సీఎం యోగి.. తప్పుచేసినవాళ్లపైనే కాదు.. ప్రతిపక్షాలపై కూడా బుల్డోజర్ చర్యకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన నేతపైనే బుల్డోజర్ చర్యకు దిగడం ఆసక్తికరంగా మారింది.. తాజాగా, నోయిడా హౌజింగ్ సొసైటీలో ఓ మహిళపై స్థానిక బీజేపీ నేత అనుచితంగా ప్రవర్తించాడు.. ఆమెను దూషించి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి… ఓ మహిళ పట్ల.. బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేసింది.. అయితే, ఇవాళ అధికారులు బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటి వద్ద ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడం చర్చగా మారింది..
Read Also: PM Modi: ఇది ఎమోషనల్ మూమెంట్.. వెంకయ్య సాక్షిగా సభలో అనేక చారిత్రక ఘటనలు..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఈరోజు నోయిడా హౌజింగ్ సొసైటీకి బుల్డోజర్ రావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.. చప్పట్లు కొట్టారు. సీఎం యోగి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. కాగా, నోయిడా సెక్టర్ 93బీలో నివసిస్తున్న ఓ మహళతో బీజేపీ నేత త్యాగి అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ఘటనలో ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.. శ్రీకాంత్ త్యాగి ప్రస్తుతం పరారీలో ఉండగా.. అక్రమంగా సొసైటీ పార్క్‌ను కబ్జా చేసిన త్యాగిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా.. అక్రమ నిర్మాణాన్ని చేపట్టడంతో.. ఓ మహిళ ప్రశ్నించింది.. ఆమెను నెట్టివేయడమే కాదు.. దూషించినట్టు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాకు ఎక్కింది.. ఇక, ఇవాళ బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటి వద్ద ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇక, శ్రీకాంత్ త్యాగి నలుగురు సన్నిహితులను అదుపులోకి తీసుకున్నామని, త్యాగికి చెందిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని నోయిడా పోలీసులు ప్రకటించారు.. త్యాగిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354 కింద శుక్రవారం కేసు నమోదు చేశారు పోలీసులు.. త్యాగి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.. అతడిని వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!