ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను ప్రేమించాలంటూ గత కొంతకాలంగా ఓ యువతిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడు.. ఆ యువతి నిరాకరించడంతో ఉన్మాదిగా మారిపోయాడు… ఆ యువతిని ఎలాగైనా మట్టుబెట్టాలనుకున్నాడు.. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో… ఢీకొట్టాడు.. తర్వాత అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.. చివరకు అసలు విషయం వెలుగు చూడడంతో.. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Raj Gopal Reddy: రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి సవాల్.. మునుగోడులో గెలిచేది నేనే..!
కల్యాణదుర్గంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. భాస్కర్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమపేరుతో మైథిలి అనే యువతి వెంటపడ్డాడు.. వేధింపులకు గురిచేశాడు.. అయితే, ఆ యువతి ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుంది.. వరుసకు అన్న కావడంతో భాస్కర్ ప్రేమను నిరాకరించింది. దీంతో, యువతిపై కోపం పెంచుకున్న భాస్కర్.. స్కూటర్‌పై వెళ్తున్న మైథిలిని కారుతో ఢీకొట్టాడు.. కంబదూరు మండలం బోయలపల్లి దగ్గర ఈ ఘటన జరగగా.. మొదట ప్రమాదంగా భావించారు స్థానికులు.. అయితే, మైథిలిని ఢీకొట్టిన తర్వాత.. వేగంగా కారు వెళ్లడంతో.. కొద్దిదూరంలోనే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.. దీంతో, అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు.. ఇక, కారు ఢీకొన్న ప్రమాదంలో మైథిలికి తీవ్ర గాయాలయ్యాయి… యువతిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు.