ముంబయికి చెందిన యువ డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో తన సోదరితో కలిసి బుధవారం ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్ పెట్టారు. 2 అంగుళాల మనిషి వేలు కనిపించింది. దీంతో ఆమె స్వయంగా డాక్టర్ కావడంతో వెంటనే దానిని పరిశీలించింది.
ఫొటోలు దిగడం.. సెల్ఫీలు తీసుకోవడం.. ఆయా సందర్భాల్లో ప్రతీ ఒక్కరూ తీసుకుంటుంటారు. అయితే దానికో పద్ధతి.. విధానం ఉంటుంది. ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటామంటే కుదరదు.
ఓ మహిళ ప్రయాణికురాలు రైలులో ప్రయాణిస్తున్న వేళ.. తాను పడిన బాధను రెడ్డిట్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత గురించి మరోసారి లేవనెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వనాంచల్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లో వెళ్తున్న తనను.. ఓ వ్యక్తి ఎలా వేధించాడో తెలిపింది. తాను.. స్లీపర్ కోచ్‌లో ఒంటరిగా ప్రయాణించడం ఇదే తొలిసారి అని చెప్పింది. కోచ్లో ఇద్దరు మగ ప్రయాణికులు తన ముందు సీట్లోనే కూర్చున్నారని.. అంతా బాగానే ఉందని…
ట్యాక్సీ రైడర్ అవతారమెత్తి ఓ దొంగ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఓలా ట్యాక్సీ రైడర్‌గా ఉంటూ.. ప్రయాణికుల వద్ద నుంచి పలు వస్తువులను కొట్టేసేవాడు. తాజాగా.. ఓ మహిళ బ్యాగ్‌తో పారిపోయి పోలీసులకు చిక్కాడు. ఆ బ్యాగ్‌లో ఐఫోన్, ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని సొసైటీలో నివసిస్తున్న అధీరా సక్సేనా అనే మహిళ ఓలా బైక్‌ను బుక్ చేసింది. బైక్ పై ప్రయాణం చేసి…
తన భార్యను, ప్రేమికుడిని ఓ చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన రాజస్థాన్‌లోని బన్స్వారాలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అయితే.. భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడి వాతావరణం చల్లబడితే, మరికొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. ఓ మహిళ ఎండలు ఎంతలా ఉన్నాయి అనే దానికి ఏం చేసిందో చూస్తే అవాక్కైతారు.
రాజస్థాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోన్ ఎక్కువగా వాడుతుందని కూతురిని తల్లి రాడ్తో కొట్టి చంపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల నికితా సింగ్, బిందాయక ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే.. ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. అయితే చదువుకోవడం మానేసి నికితా ఎక్కువ సమయం ఫోన్లో గడిపేదని, అందుకే ఆమె ఫోన్ ను రెండున్నర నెలల క్రితం తీసుకున్నట్లు ఆమె తండ్రి తెలిపారు.
రైలు ప్రయాణం చేసేటప్పుడు తమతో పాటు తమ లగేజీలను బ్యాగ్ లలో తీసుకువెళతారు. అయితే.. అందులో ఏముంటుందన్న విషయం పక్కన కూర్చే వారికి తెలియదు. కానీ.. స్మగ్లర్లు రైలు ప్రయాణం ద్వారానే.. కోట్లాది విలువ చేసే డ్రగ్స్ ను రాష్ట్రాలు దాటిస్తున్నారు. సమాచారం అందితే దొరికేవి కొన్నైతే.. దొరకనివి చాలా ఉన్నాయి. తరుచూ మనం చూస్తూనే ఉంటాం.. రైళ్లలో డ్రగ్స్ తరలిస్తున్నారని.. పట్టుబడ్డారన్న వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.