Chandrababu: చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి ఆయన ఏం చేశారంటే..?
- చంద్రబాబును చూసేందుకు వచ్చిన ఓ మహిళ.. ఆయన కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది.. ఇది గమనించిన చంద్రబాబు.. కారు ఆపి.. ఆమెతో మాట్లాడారు.. అనారోగ్యంతో ఉన్న ఆమెకు ధైర్యం చెప్పి.. ఆమెకు అవసరమైన సాయం చేయాలంటూ పార్టీల నేతలకు సూచించారు చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో కొత్త రికార్డు క్రియేట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.. రేపు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.. మరోవైపు.. సమావేశాలు.. కేబినెట్ మంత్రులపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు.. అయితే, కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్తున్న చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలుకుతున్నారు.. ఇక, చంద్రబాబును చూసేందుకు వచ్చిన ఓ మహిళ.. ఆయన కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది.. ఇది గమనించిన చంద్రబాబు.. కారు ఆపి.. ఆమెతో మాట్లాడారు.. అనారోగ్యంతో ఉన్న ఆమెకు ధైర్యం చెప్పి.. ఆమెకు అవసరమైన సాయం చేయాలంటూ పార్టీల నేతలకు సూచించారు చంద్రబాబు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ రోజు ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి తిరుగు ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి.. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ.. చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది. తనను చూసి ఎమోషనల్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు.. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది సదరు మహిళ.. ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా.. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చాను అని నందిని చెప్పగా.. ముందు ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని.. అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు నాయుడు.




తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!