Chocolate Syrup: చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక.. ఫిర్యాదుపై స్పందించిన కంపెనీ
- ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక
- ఇన్‌స్టాగ్రామ్ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chocolate Syrup: ఇటీవల ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ప్యాకెట్లలో పాములు, ఎలుకలు, మానవుని వేళ్లు వస్తున్నాయి. ఇటీవల ముంబై నివాసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మానవ వేలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్శిల్ లో పాము కూడా వచ్చింది. ఇక మరో ఆన్ లైన్ ఆర్డర్ లో చనిపోయిన ఎలుక బయటపడింది. అవును జెప్టో ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్‌లో చనిపోయిన ఎలుకను గుర్తించిన ఒక మహిళ పూర్తిగా షాక్ కు గురైంది. ప్రమీ శ్రీధర్ అనే మహిళ చాక్లెట్ సిరప్ లో ఎలుక వచ్చిన సంఘటనను వీడియోలో రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు హెర్షీ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ఆమె ఫిర్యాదుపై కంపెనీ స్పందించింది. హెర్షీ కంపెనీ బ్రాండ్ ఇలా రాసుకొచ్చింది. “హాయ్, దీన్ని చూసి మేము చాలా చింతిస్తున్నాము. దయచేసి మాకు యూపీసీ, తయారీ కోడ్‌ను బాటిల్ నుంచి consumercare@hersheys.com రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపండి, తద్వారా మా బృంద సభ్యులలో ఒకరు మీకు సహాయం చేయగలరు!” అని హెర్షీ కంపెనీ సమాధానం ఇచ్చింది.
Read Also: WhatsApp call Record : వాట్సాప్ కాల్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే..
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
ప్రమీ శ్రీధర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వీడియో పోస్ట్ చేసి దాని కింద వివరాలను వెల్లడించారు. జెప్టో ఆర్డర్ లో షాకింగ్ సంఘటన ఒకటి చోటుచేసుకుందని.. సిరప్ ను ఒక కప్పులో పోయగా అందులో ఒక చనిపోయిన ఎలుక వచ్చిందని వెల్లడించారు. హెర్షే చాక్లెట్ సిరప్‌ని బ్రౌనీ కేక్‌లతో తినడానికి జెప్టోలో ఆర్డర్ చేశామని చెప్పారు. కేక్ పై పోస్తుండగా నల్లని వెంట్రుకల లాంటి పదార్థం వచ్చిందని, ఈ క్రమంలో సిరప్ ను డిస్పోజబుల్ గ్లాసులో పోసి చూడగా చనిపోయిన ఎలుకగా గుర్తించామన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియా యూజర్లు కూడా అంతే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హెర్షే కంపెనీపై దావా వేయొచ్చని, ఆహార భద్రత డిపార్టుమెంట్ వారికి ఫిర్యాదు చేయొచ్చని ఓ నెటిజన్ చెప్పారు. జెప్టో ఇక్కడ తప్పు చేయనందున హర్షేపై ఫిర్యాదు చేయమని పలువురు ఇతరులు ప్రమీ శ్రీధర్ ను కోరారు.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!