Mexico: రన్నింగ్ ట్రైన్ దగ్గర సెల్ఫీ కోసం ఓవరాక్షన్.. ఏం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫొటోలు దిగడం.. సెల్ఫీలు తీసుకోవడం.. ఆయా సందర్భాల్లో ప్రతీ ఒక్కరూ తీసుకుంటుంటారు. అయితే దానికో పద్ధతి.. విధానం ఉంటుంది. ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటామంటే కుదరదు. కొన్ని సార్లు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.. ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. అయినా కూడా కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంటారు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ.
సహజంగా రన్నింగ్ ట్రైన్ వెళ్తుంటే భూమి అదురుతుంది. ఆ శబ్ధానికే గుండె అదురుతుంది. బాడీ షేక్ అవుతుంది. అలాంటిది ఒక యువతి ఏకంగా రైలు సమీపంలోకి వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసింది. అంతే ఇంజిన్ ముందు భాగంగా తలకు తగిలి కుప్పకూలిపోయింది. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మెక్సికోలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Also Read
ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తుంటారు. ఇదొక పాతకాలపు రైలు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం పోటీ పడుతుంటారు. హిడాల్గో సమీపంలో సెల్ఫీలు తీసుకునేందుకు జనం గుమిగూడారు. అయితే అందులో ఒక యువతి(20) తన కొడుకుతో కలిసి రైల్వే ట్రాక్ దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసింది. అంతే ఇంజన్ ముందు భాగం తగలి స్పాట్‌లోనే మృతిచెందింది. విడ్డూరం ఏంటంటే.. యువతి ప్రాణాలు కోల్పోయి.. కిందపడిపోతే మిగతా వారు కనీసం దగ్గరకు రాకుండా మొబైల్‌లో వీడియోలు తీస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘ఎంప్రెస్’ అనే ఈ రైలు 1930లో నిర్మించబడింది. ఇదొక ఆవిరి లోకోమోటివ్. స్పైక్ స్టీమ్‌లో భాగంగా కెనడా-మెక్సికో మధ్య నడవనుంది. ఈ ప్యాసింజర్ రైలు ఏప్రిల్‌లో కాల్గరీ నుంచి బయలుదేరింది. ఈ పర్యటన శుక్రవారం మెక్సికో సిటీలో ముగుస్తుంది. తిరిగి జూలైలో కెనడాకు వస్తుంది.
ఇదిలా ఉంటే యువతి మృతి పట్ల కెనడియన్ పసిఫిక్ కాన్సాస్ సిటీ కంపెనీ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది. అలాగే విచారణకు సహకరిస్తామని తెలిపింది. రైలు ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్‌ల నుంచి కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
https://twitter.com/ManyFaces_Death/status/1798373325397495919
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!