భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే దంపతులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో పచ్చని సంసారాలు మధ్యలోనే బుగ్గి పాలవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో తన ప్రేమికుడితో ఫోన్లో మాట్లాడిందనే కారణంతో ఓ భర్త తన భార్యను, అత్తను హత్య చేశాడు. ఆదివారం రాత్రి భర్త ఇంటికి రాగా, భార్య ప్రేమికుడితో మాట్లాడుతూ కనిపించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవ దాకా వెళ్లింది. ఇంతలో భార్య తల్లి అడ్డుకోవడంతో ఆగ్రహించిన భర్త పదునైన ఆయుధంతో ఇద్దరినీ నరికి చంపాడు. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఆరవై సంవత్సరాల కిందట ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కష్టనష్టాల్లో కలిసి నడిచారు. చివరికి ఈ లోకాన్ని కూడా కొద్ది గంటల వ్యవధిలోనే నువ్వు లేక నేను లేను అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు..
మహారాష్ట్రలోని థానేలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు చూసింది. తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి రూ.4 లక్షల కోసం వేధించినందుకు ఓ వ్యక్తితో పాటు అతని కుటుంబానికి చెందిన మరో నలుగురిపై థానే పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. కోటా నగరంలోని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా భార్య తన భర్తపై కత్తితో దాడి చేసింది. కడుపులో బలమైన గాయం కావడంతో భర్త రక్తపు మడుగులో పడ్డాడు. అతన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. వీరిద్దరికీ 10 నెలల క్రితమే వివాహమైంది. యువకుడి కుటుంబ సభ్యులు యువతిపై, ఆమె తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో యువ దంపతుల్లో భార్య అదృశ్యం అయింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సీసీ కండ్రిగ గ్రామానికి చెందిన భర్త వెల్లూరు రాజా (22), భార్య పెంచలమ్మ (20).. దీపావళి పండుగ కోసమని అన్నమయ్య జిల్లా చిట్వేలులోని అత్తగారి ఇంటికి వెంకటగిరి నుంచి బయల్దేరారు. అయితే.. రాపూరు బస్టాండ్ నుంచి బస్సులో ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్న ఒక్క అపరిచిత వ్యక్తితో దంపతులు రాజంపేట పాత బస్టాండ్లో దిగారు.
Husband Murder: ఈ రోజుల్లో ఆస్తికోసం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. జన్మనిచ్చిన వాళ్లను కూడా ఆస్తి కోసం హత్య చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణంగా హత్యకు గురయ్యాడు. వ్యాపారవేత్త రమేశ్కుమార్(54) హత్యకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ సమీపంలో హత్య చేసి ఊటీ ఎస్టేట్లో ఆయన మృతదేహాన్ని తగులబెట్టారు. ఉప్పల్-భువనగిరి ప్రాంతంలో ఆయనను హత్య చేసినట్లు తెలిసింది. భార్య నిహారిక, ఆమె…
కాకినాడ జిల్లా ఏవీ నగరంలో ప్రియుడుతో కలిసి భర్త మధుకి విషంపెట్టి చంపింది భార్య.. స్థానికంగా ఉన్న రిఫరల్ హాస్పిటల్లో పనిచేసే మృతుడి భార్యకి.. అక్కడే పనిచేసే ప్రశాంత్తో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా హద్దులు దాటేసింది.. వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఈ విషయం కాస్తా భర్త మధుకు తెలియడంతో.. ఆ కుటుంబంలో గొడవలు మొదలైనట్టుగా తెలుస్తోంది..
Sangareddy Crime: ఆస్తి కోసం ఐదు రోజులు ఆస్పత్రిలోనే శవం ఘటన సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట (మం) తంగేడుపల్లిలో సంచలనం సృష్టించింది. ఆస్తి ఇచ్చేంత వరకు భర్త అంత్య క్రియలు జరిపేది లేదని తేల్చి చెప్పింది.
సంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి మాదిరి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. ఈ ఘటన సదాశివపేట (మం) తంగేడుపల్లిలో జరిగింది. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అన్న దానికి ఇదే నిదర్శనం.. వివరాల్లోకి వెళ్తే, తన భర్త ఐదు రోజుల క్రితం చనిపోయాడు. అయితే.. అప్పటి నుంచి ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. కాగా,…