మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితులకు బడితపూజ జరిగింది. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు జ్యుడీషియల కస్టడీకి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు పంపింది. నిందితులను కోర్టులో హాజరుపరిచి పోలీసులు బయటకు తీసుకొస్తుండగా.. ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న న్యాయవాదులు అమాంతంగా ఎటాక్ చేశారు.
పరాయి వ్యక్తుల మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. అనుమానాలు పెనుభూతాలుగా మారి భర్త భార్యను, భార్య భర్తను అంతమొందిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారిని భార్య హత్య చేసింది. మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి,…
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సృష్టిలో స్త్రీ, పురుషుల బంధం చాలా ప్రత్యేకమైంది. పెళ్లి అనే రెండు అక్షరాలతో అమ్మాయి-అబ్బాయి వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు. నాటి నుంచి ఒక కుటుంబంగా ఏర్పడతారు. భారతీయ సంస్కృతిలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటిది ఈ మధ్య జంటలు.. వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు.
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమతో ఓ భర్త.. అర్ధాంగి కోసం లగ్జరీ కారు కొని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే కారుతో తన భార్య ఎంతో సంతోషిస్తుందని భావించాడు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. భాగస్వామికి గిఫ్ట్ నచ్చలేదు. అంతే తన భార్యకు నచ్చనిది తనకు నచ్చదని రూ.27లక్షల ఖరీదైన లగ్జరీ కారును డింపింగ్ యార్డ్‌లో పడేశాడు.
పాపన్నపేట (మం) బాచారం గ్రామానికి చెందిన భర్త ఆశయ్య (55).. ఈ నెల 15న పొలం పనులకు వెళ్లి కాలు జారి పడ్డాడు. అయితే అతని కాలు, నడుముకు గాయమై నడవలేని స్థితిలో ఉన్నాడు. అయితే భర్త ఆరోగ్యం కుదుటపడటానికి ఆస్పత్రికి డబ్బులు ఖర్చు అవుతాయని భావించిన భార్య శివమ్మ.. తన అల్లుడితో కలిసి భర్తను చంపేసింది.
డబ్బుల కోసం ఓ భర్త సైకోగా మారిపోయాడు.. నువ్వు ఏదైనా చేసి.. చివరకు.. నాకు మాత్రమే చూపించాల్సిన నీ అందాలను.. ఆన్లైన్లో చూపించూ.. న్యూడ్ కాల్స్ చేసి.. మొత్తానికి డబ్బులు కావాలి అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.. భార్యను న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్నాడు ఓ సైకో భర్త... ఆ వేధింపులను తట్టుకోలేక.. తన భర్త నుండి రక్షణ కల్పించాలని మీడియా ముందుకు వచ్చింది తిరుపతికి చెందిన శ్రీదేవి అనే మహిళ
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కడప నగరంలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఇమ్రాన్ డబ్బులు ఇవ్వాలంటూ తన భార్య జమీలను ఒత్తిడి చేశాడని అయితే 300 రూపాయలు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకా ఇవ్వాలంటూ ఆమెను హింసించాడని, డబ్బులు ఇవ్వడానికి జమీల నిరాకరించడంతో ఆగ్రహంతో సుత్తితో ఆమెను అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు వారు పేర్కొన్నారు.
భార్యాభర్తల అన్నాక చిన్న చిన్న గొడవలు.. అలకలు ఉంటాయి. కొద్దిసేపు కోపం ఉంటుంది. మరికొద్దిసేపటికే కలిసి పోతుంటారు. ఇలా ప్రతి సంసారంలోనూ కామన్‌గా జరుగుతుంటాయి. అంతమాత్రాన తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే కాపురాలు కూలిపోతాయి.
ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హత్య చేయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. హత్య చేశాక ఏమీ తెలియని అమాయకురాలిగా.. తన భర్త కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసుల విచారణలో భార్య బాగోతం బయటపడింది. భార్య లక్ష్మీ(40) 25 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.