సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం ఉత్తరపల్లిలో యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిన్న దారుణ హత్యకు గురైన రాజు (35) హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. భర్తని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. విచారణలో ఏమీ తెలియనట్టు అమాయకత్వం ప్రదర్శించిన భార్య సుమలతను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం… సుమలత 12 ఏళ్ల క్రితం రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుమలతపై ప్రేమతో రాజు తన…
ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి . వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తపై భార్య.. భార్యపై భర్త.. అనుమానాలు పెంచుకుంటున్నారు. కొందరైతే చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. తన భార్య మొబైల్ ఫోన్ అధికంగా వాడిందన్న కారణంతో భర్త ఆమెను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా.. డీకేఎస్ ఆస్పత్రిలో చేర్పించారు.…
ఏ వ్యక్తికైనా వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్లి నిర్ణయం జీవితంపై ఆధారపడి ఉంటుంది. ఇకవేళ తప్పటడుగు వేస్తే జీవితాంతం భరించాల్సి ఉంటుంది. అలాంటి ఓ ఘటన చైనాలో జరిగింది. పెళ్లి కాకముందే ఓ చైనా వ్యక్తి మనోవేదనకు గురయ్యాడు. పెళ్లి గురించి ఆత్రుతగా ఉన్న అతను పెళ్లికి ముందే తన కాబోయే భార్య కోసం దాదాపు రూ.55 లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి ముందే పెళ్లయినట్లు తెలిసింది. దీంతో బిత్తర…
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. భార్య నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కొన్ని రోజుల క్రితం నికితా, ఆమె కుటుంబం వేధింపులకు బరిచలేక ఆరోపిస్తూ.. టెకీ ఆత్మహ్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడి ఇల్లు తగులబెట్టి సజీవ దహనం చేసుకున్న షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దహనానికి ముందు భార్యపై కూడా పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, స్థానికులు సహా నలుగురు గాయపడ్డారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాన్‌పురి ప్రాంతంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బి అమరేశ్వర్రావుగా గుర్తించారు.
మగవాళ్లు ఆడవాళ్లను వేధించడం, వాళ్ల ఇళ్లల్లోంచి వెళ్లగొట్టడం లాంటి ఉదంతాలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ యూపీలోని అమ్రోహా జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్య భర్తను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ మహిళ యూపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్. తన భార్య తనను కొట్టిందని.. జైలుకు పంపుతానని బెదిరించిందని బాధితుడైన భర్త ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే దంపతులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో పచ్చని సంసారాలు మధ్యలోనే బుగ్గి పాలవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తన ప్రేమికుడితో ఫోన్లో మాట్లాడిందనే కారణంతో ఓ భర్త తన భార్యను, అత్తను హత్య చేశాడు. ఆదివారం రాత్రి భర్త ఇంటికి రాగా, భార్య ప్రేమికుడితో మాట్లాడుతూ కనిపించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవ దాకా వెళ్లింది. ఇంతలో భార్య తల్లి అడ్డుకోవడంతో ఆగ్రహించిన భర్త పదునైన ఆయుధంతో ఇద్దరినీ నరికి చంపాడు. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఆరవై సంవత్సరాల కిందట ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కష్టనష్టాల్లో కలిసి నడిచారు. చివరికి ఈ లోకాన్ని కూడా కొద్ది గంటల వ్యవధిలోనే నువ్వు లేక నేను లేను అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు..