Sangareddy: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన భార్య..
- సంగారెడ్డి జిల్లాలో దారుణం
- ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన భార్య
- తన భర్త కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
- 25 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం మంట గలుపుతున్నారు. కట్టుకున్న వాళ్లను వదిలేసి కామంతో వేరొకరిని వెతుకుతున్నారు. తమ పిల్లలను కూడా పట్టించుకోకుండా.. వేరే వాళ్లతో కులుకేందుకు ప్రాణాలు తీసేంత వరకూ తెగిస్తున్నారు. పచ్చని సంసారాన్ని ఆగం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించింది భార్య. అసలు వివరాల్లోకి వెళ్తే…..
Read Also: BC Janardhan Reddy: వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రోడ్లపై పక్క రాష్ట్రాలు జోకులు వేశాయి..
Also Read
ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హత్య చేయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. హత్య చేశాక ఏమీ తెలియని అమాయకురాలిగా.. తన భర్త కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసుల విచారణలో భార్య బాగోతం బయటపడింది. భార్య లక్ష్మీ(40) 25 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడిపై మోజుతో భర్తను హత్య చేయించింది.. భర్త బైక్ పై వెళ్లస్తుండగా నిందితులు అతన్ని వేటాడి చంపేశారు. మృతుడు నారాయణ(45) స్వస్థలం కామారెడ్డి జిల్లా భిక్కనూరు (మం) మల్లుపల్లి గ్రామం. నారాయణ, లక్ష్మికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. హత్నూర (మం) బోర్పట్లలోని ఓ పరిశ్రమలో గత మూడేళ్ళుగా పని చేస్తున్నాడు నారాయణ. బిక్కనూరులో ఉండే ఓ యువకుడితో లక్ష్మీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను చంపేస్తే ఇద్దరు కలిసి ఉండొచ్చని ప్లాన్ వేసి మర్డర్ చేయించింది. కాగా.. ఈ హత్య ఘటనలో లక్ష్మీ, ప్రియుడుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Bharat Mata Foundation: క్రాకర్ షోలో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం..
- Tags
- boyfriend
- Crime News
- husband
- Killed
- Love
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!