ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమతో ఓ భర్త.. అర్ధాంగి కోసం లగ్జరీ కారు కొని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే కారుతో తన భార్య ఎంతో సంతోషిస్తుందని భావించాడు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. భాగస్వామికి గిఫ్ట్ నచ్చలేదు. అంతే తన భార్యకు నచ్చనిది తనకు నచ్చదని రూ.27లక్షల ఖరీదైన లగ్జరీ కారును డింపింగ్ యార్డ్‌లో పడేశాడు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nandamuri Balakrishna: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
ప్రస్తుతం ఈ వెహికల్ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. ప్రజలు కారు దగ్గరకు వచ్చి ఫొటోలు దిగుతున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఈ సంఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా.. అధికారులు పట్టించుకోలేదు. ఆ కారును అలానే ఉంచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: USA: రష్యాని చైనా ‘‘జూనియర్ భాగస్వామి’గా ఉండనీయబోము..
అయితే స్థానిక మీడియా ప్రకారం.. భార్యాభర్తలు చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నారని.. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు భర్త లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే చిన్న చిన్న డ్యామేజ్‌లు ఉండడంతో ఆమె కారును తిరస్కరించింది. దీంతో విసుగెత్తిన అతగాడు.. చెత్త డింపింగ్‌లో కారును పడేశాడు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది.
ఇది కూడా చదవండి: Pune Rape Case: సంచలనంగా పూణే అత్యాచార ఘటన.. చెరకు తోటలో నిందితుడు, డ్రోన్లతో గాలింపు..