భార్యభర్తల మధ్య గొడవ.. కొడుకు ప్రాణం తీసింది. గొడవ పడొద్దని అడ్డుగా వచ్చిన తనయుడిపై తండ్రి కోపంతో దాడి చేశాడు. దీంతో.. కొడుకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ క్రమంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది.
మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబల్పూర్ జిల్లాలో రైల్వే ఉద్యోగి, అతని భార్య వారి ఇద్దరు పిల్లలతో సహా కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం భేదాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోడా గ్రామంలో జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ నేమా తెలిపారు.
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి.. తగులబెట్టి.. భోపాల్లోని డంప్ యార్డ్ సమీపంలో పాతిపెట్టాడు. ఈ ఘటన మే 21న జరిగింది. కాగా.. భర్త నదీమ్ ఉద్దీన్ ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం.. పాతిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ భర్త తన అత్తమామల ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి భార్య, పిల్లల మృతదేహాలు కూడా అతని అత్తమామల ఇంటి నుంచి లభ్యమయ్యాయి.
లైంగిక నేరాల ఆరోపణల తర్వాత గత నెలలో జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ.. తన భర్తను ఇంతకుముందు అరెస్టు చేసిన కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్డి రేవణ్ణను ఏప్రిల్ 29న ఇంటి పనిమనిషిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేశారు. హెచ్డి రేవణ్ణ కిడ్నాప్ చేసిన మహిళ తమ ఇంటిలో పని చేస్తుందని.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి…
కట్టుకున్న భార్యపై అనుమానంతో కడతేర్చాలని ప్రయత్నించాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని జగనన్న కాలనీలో చోటుచేసుకుంది. అనుమానం నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా మరోసారి ఆ విషయంపై వాగ్వాదం నెలకొనగా.. ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
కాలం మారుతోంది. గతంలో భర్తలు తాగొచ్చి భార్యలను చితకబాదేవారు. మారిన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలవుతుండటం, ఆడవాళ్ల కష్టాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టటంతో.. తమ భార్యలపై చేయిచేసుకోవాలంటే భర్తలు జంకుతున్నారు.
రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. కట్టుకున్న భార్య పట్ల ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు. కలకాలం తోడుగా.. అండగా ఉండాల్సిన అర్ధాంగి పట్ల దుశ్చర్యకు పాల్పడ్డాడు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.