HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
- కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై చర్యలు
- వాణి కో-ఆపరేటివ్ సొసైటీ కూల్చివేతపై సుమోటో విచారణ
- రెవెన్యూ అధికారుల నివేదిక లేకుండానే కూల్చివేతలు?
- సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన ముందస్తు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారన్న వ్యవహారంలో ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ‘వాణి కో-ఆపరేటివ్ హెచ్‌జిఎస్ సొసైటీ’కి సంబంధించిన భవనాల కూల్చివేత అంశంపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా యంత్రాలతో కూల్చివేతలు చేపట్టడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిషనర్ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది.
రెవెన్యూ అధికారుల సూచనలు లేవు..
ఈ కేసు విచారణ సందర్భంగా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అధికారిక సూచనలు లేదా నివేదికలు లేనప్పటికీ హైడ్రా అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని బాధితుల తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ రంగనాథ్ తీసుకున్న చర్యల వల్ల ఇతర ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పుడు కోర్టు బోనులో నిలవాల్సి వస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై పూర్తి స్థాయి నిజానిజాలను తేల్చేందుకు సదరు స్థలానికి సంబంధించిన సమగ్ర నివేదికను అందజేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు యొక్క తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత నాయస్థానం ప్రకటించింది.
Also Read
- Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!