AP Crime: కలకాలం కష్టసుఖాల్లో తోడుగా ఉంటుందనుకున్న భార్య అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే తన ప్రియుడుతో కలిసి మరి కొంతమంది సహకారంతో భర్తను హత్య చేయగా ఆ కేసుకు సంబంధించిన ముద్దాయిలను ఈరోజు అదుపులోనికి తీసుకుని కోర్టు ముందు హాజరు పర్చారు పోలీసులు.. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుడైన చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్ ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నాడు. అయితే, అతని భార్య చిగురుశెట్టి శిరీష.. ఏలూరు జిల్లా, నిడమర్రు మండలం, ఎనికేపల్లి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి పరశురామయ్య అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఈ క్రమంలో శిరీష తన భర్త వాళ్ల అక్రమ సంబందానికి అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా తన భర్తను చంపివేయాలని పథకం పన్నింది. అనుకున్నదే తడవుగా శిరీష తన ప్రియుడైన పరశురామయ్యకి చెప్పగా, పరశురామయ్య మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్లాన్ చేశారు..
Read Also: Ukrainian crisis: మోడీ సూచనకు థ్యాంక్స్ చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్
ఇక, వారి ప్లాన్‌లో భాగంగా.. సుభాష్ చంద్రబోసుకి ఫోన్ చేసి పెదపట్నం నుండి ఫోన్ చేస్తున్నాము. మాకు ఉల్లిపాయలు కావాలి ఉల్లిపాయలు వేసుకువచ్చినందుకుగాను కిరాయి కూడా ఇస్తాము అని నమ్మబలికారు.. దీంతో.. ఆటోలో కొన్ని ఉల్లిపాయల మూటలు వేసుకుని పెదపట్నం బయల్దేరాడు.. ముందే వేసుకున్న పథకం ప్రకారం 05.07.2024న సుమారు రాత్రి 7 గంటల సమయంలో బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామంలో స్మశానం దగ్గరకి చిగురుశెట్టి సుబాష్ చంద్రబోసు రాగానే, వెనుక నుండి బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆటోను ఆపి మేమే ఉల్లిపాయల కోసం ఫోన్ చేసింది అని చెప్పారు.. ఆటో నుంచి దిగిన చంద్రబోస్ తనతో తీసుకువచ్చిన ఉల్లిపాయలను చూపిస్తుండగా.. సదరు ముగ్గురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు.. ఐరన్ పైపులు, గాలి పంపుతో విచక్షణరహితంగా తలపై, ముఖంపై బలంగా కొట్టారు.. దాడి చేసిన అనంతరం అక్కడి నుండి పరారయ్యారు. అదే సమయంలో అంతట మెకానిక్ శివ అనే వ్యక్తి సుభాష్ చంద్రబోస్ కి షాప్ రెంట్ ఇచ్చే నిమిత్తం ఫోన్ చేయగా 108 అంబులెన్స్ వారు సుభాష్ చంద్రబోస్ ఫోన్ ఆన్సర్ చేసి ఇతన్ని ఎవరో కొట్టి పడవేసినారు. మేం బందర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళుచున్నాము అని చెప్పినారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రబోస్ మరణించాడు.
Read Also: కుర్రాళ్ళ కొత్త కలల రారాణి ప్రీతి ముకుందన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
దెబ్బలతో సుభాష్ చంద్రబోస్ చనిపోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ నాగేంద్రప్రసాద్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి, సదరు కేసులో ముద్దాయిలయిన వారిని అదుపులోనికి తీసుకొని వారిని విచారించి విచారణలో హత్య చేసింది తామే అని ఒప్పుకోవడంతో వారిని ఈరోజు కోర్టుమందు హాజరుపరిచారు.. ఈ హత్య తమ యొక్క అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చిగురుశెట్టి శిరీష, తిరుమలశెట్టి పరశురామయ్య, మిగిలిన ముగ్గురు ముద్దాయిలతో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.. ఇక, హత్య జరిగిన అతి తక్కువ సమయంలోనే కేసును ఛేదించి ముద్దాయిలకు శిక్ష పడడానికి కృషి చేసిన పెడన ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్, బంటుమిల్లి ఎస్ఐ వాసు, గూడూరు ఎస్సై వీర్రాజు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు..