AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oracle Layoffs: టెక్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన ఒరాకిల్ (Oracle) మరోసారి ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు కొనసాగిస్తూనే.. ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నెలలో కొత్త లేఆఫ్స్ చేపట్టాలని కంపెనీ యోచిస్తున్నట్లు ప్రముఖ నివేదిక వెల్లడించింది.
బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. ఒరాకిల్‌లో లేఆఫ్స్‌కు గురయ్యే ఉద్యోగులను గుర్తించాలని మేనేజర్లను కంపెనీ ఆదేశించింది. సెప్టెంబర్ 1న కంపెనీ రెండో ఆర్థిక త్రైమాసికం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అంతకంటే ముందే ఈ ఉద్యోగాల కోతలను అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని టీమ్‌లలో ఉద్యోగుల సంఖ్య రెండంకెల శాతంలో తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ఈ తాజా లేఆఫ్స్‌కు ముందు కూడా ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగులను తగ్గించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య సుమారు 21,000 మేర తగ్గింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతానికి సమానం. దీంతో ఒరాకిల్‌లో ఉద్యోగుల సంఖ్య సుమారు 1,41,000కు చేరుకుంది.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒరాకిల్ భారీగా ఖర్చు చేస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో AI సంబంధిత మౌలిక సదుపాయాల కోసం కంపెనీ సుమారు 55.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పెట్టుబడులకు మద్దతుగా కంపెనీ సుమారు 43 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 40 బిలియన్ డాలర్లను డెట్, ఈక్విటీ ద్వారా సమీకరించాలని కూడా ఒరాకిల్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.
భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ ఒరాకిల్ క్లౌడ్ వ్యాపారానికి డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా AI కంప్యూటింగ్ సామర్థ్యానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీ క్లౌడ్ సేవల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అయితే AI మౌలిక సదుపాయాలపై కంపెనీ భారీగా చేస్తున్న ఖర్చులు పెట్టుబడిదారుల్లో ఆందోళనలకు కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఒరాకిల్ షేర్లు గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. తాజా ఉద్యోగాల కోతలపై ఒరాకిల్ లేదా కంపెనీ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ లేఆఫ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..