కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా తన భర్త హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విధానాన్ని సోనియాకు వివరించారు.
బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోతీహరిలో భార్య, ముగ్గురు పిల్లలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు భర్త ఇద్దుమియాన్. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు.. వారిని హత్య చేసి ఇంటి నుండి పారిపోయాడు. అయితే.. నిందితుడు ఇద్దును పట్టుకున్న వారికి మోతిహరి పోలీసులు రూ. 15,000 రివార్డు ప్రకటించారు. అందుకోసం నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చోట్లా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన 59 ఏళ్ల భర్త దారుణ హత్యను చూసిన అనంతరం 56 ఏళ్ల వయస్సు గల భార్య ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించింది.
కర్ణాటకలోని కొప్పల్లో దారుణ ఘటన చేసుకుంది. భర్త కళ్లేదుటే ఆరుగురు వ్యక్తులు 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్తను విచక్షణారహితం కొట్టారని బాధితురాలు తెలిపింది.
ఒక మహిళ తన ఇష్టానుసారం విడివిడిగా జీవిస్తుంటే భర్త నుంచి భరణం పొందే హక్కు ఆమెకు లేదని మధ్యప్రదేశ్ జబల్పూర్లోని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భర్త నుంచి విడివిడిగా ఉంటున్న మహిళ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. భర్త నుంచి విడిగా జీవించాలని మహిళ నిర్ణయించుకున్నందున ఆమెకు భరణం అడిగే హక్కు లేదని కోర్టు పేర్కొంది.
స్నేహితులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవడం.. ఒకరి బాధలు మరొకరు పంచుకోవడం అనేది ఫ్రెండ్షిప్లో కామన్. సినిమాల్లో చూసినట్లుగా ప్రేమికులకు స్నేహితులు సహాయం చేయడం చాలా చూసుంటాం.
ఢిల్లీ మాజీ మంత్రి, జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు తన భార్యను కలిసేందుకు అనుమతి మంజూరు చేసింది. కస్టడీ పెరోల్ లో వారానికి ఒకసారి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా.. అంతకుముందు తన భార్యను వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సిసోడియా తన దరఖాస్తులో కోరారు. కాగా.. మనీష్ సిసోడియా భార్య గత 20 సంవత్సరాలుగా…