దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే.. ఈ కసాయి తండ్రి మాత్రం కవల ఆడపిల్లలు పుట్టారని చంపేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదని.. ఈ క్రమంలో తండ్రి, అతని కుటుంబం ఆ పిల్లలను చంపి.. పూడ్చిపెట్టారు. కాగా.. ఈ ఘటనపై నిందితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, న్యాయ ఆదేశాల మేరకు శిశువుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం…
నంద్యాలలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన వెంకటేశ్, మమత భార్యాభర్తలు. వెంకటేష్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు నెలకొన్నాయి.
యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఒక్కసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన ముస్కరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
భార్య చనిపోవడంతో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అస్సాం డీజీపీ జీపీ సింగ్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. ఆయన తన పోస్ట్‌లో.. 'ఇది దురదృష్టకర సంఘటన. అస్సాం హోం, పొలిటికల్ సెక్రటరీ షిలాదిత్య చెటియా ఈరోజు సాయంత్రం ప్రాణాలు తీసుకున్నారు. అతను 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్య మరణించిన నిమిషాల తర్వాత అతను ఈ చర్య తీసుకున్నాడు.…
మీరు భార్యాభర్తల మధ్య విడాకుల కేసులను చూసి ఉంటారు, కానీ ఇంగ్లాండ్‌లో ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి తన విడాకులకు బాధ్యత వహిస్తూ స్మార్ట్‌ఫోన్ తయారీదారు, ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్‌పై 6.3 మిలియన్ డాలర్ల దావా వేశారు
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న విడుదల కానుంది. కాండ్రకోట మిస్టరీ.. అనే క్యాప్షన్‌తో కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాను మైత్రీ మూవీస్ నైజాంలో…
మహారాష్ట్రలోని థానే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యపై కోపంతో తొమ్మిదేళ్ల కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి తండ్రి. నోట్లో కాగితాలు కుక్కి మరి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడు తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన థానే జిల్లా సహపూర్ తాలూకా పరిధిలోని కసర ప్రాంతంలోని వశాల వద్ద సోమవారం అర్థరాత్రి రాత్రి జరిగింది. ఘటన జరిగిన సమయంలో 59 ఏళ్ల నిందితుడు మద్యం…
భార్యభర్తల మధ్య గొడవ.. కొడుకు ప్రాణం తీసింది. గొడవ పడొద్దని అడ్డుగా వచ్చిన తనయుడిపై తండ్రి కోపంతో దాడి చేశాడు. దీంతో.. కొడుకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఈ క్రమంలో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది.
మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబల్పూర్ జిల్లాలో రైల్వే ఉద్యోగి, అతని భార్య వారి ఇద్దరు పిల్లలతో సహా కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం భేదాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోడా గ్రామంలో జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ నేమా తెలిపారు.
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి.. తగులబెట్టి.. భోపాల్‌లోని డంప్ యార్డ్ సమీపంలో పాతిపెట్టాడు. ఈ ఘటన మే 21న జరిగింది. కాగా.. భర్త నదీమ్ ఉద్దీన్ ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం.. పాతిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.