కేరళలోని దక్షిణ జిల్లా కొల్లాంలోని పరవూర్‌లో మంగళవారం ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెకు విషపూరిత పదార్థం ఇచ్చి, ఆపై వారి గొంతులను కోసి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పూతక్కుళానికి చెందిన 46 ఏళ్ల శ్రీజు అనే నిందితుడు తన పెద్ద కుమారుడు శ్రీరాగ్ (17) ను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని, తరువాత అతని పొడిచి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పరవూర్ పోలీసులు తెలిపారు. నేడు ఉదయం తండ్రి, కొడుకు ఇద్దరూ తమ ఇంట్లో విషమ పరిస్థితిలో కనిపించారని,…
యూపీలో గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్ నుంచి ఒక మహిళ మృతదేహాన్ని సోమవారం వెలికితీయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
మేడ్చల్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భర్తను గొలుసులతో బంధించి భార్య చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి కృష్ణ (50), భారతి (45) అంబేద్కర్ నగర్ నివాసితులు. రెండు అపార్ట్మెంట్ల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది. కృష్ణ తన భార్య నుండి ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భారతి భార్య మూడు రోజుల…
ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్‌పై బహిరంగంగా కొడుతూ తోసేసుందుకు ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. భార్యను కొడుతున్న వీడియో వైరల్ కావడంతో.. నిందితుడు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రోషన్ గా గుర్తించారు. ఆ వీడియోలో చెన్నైలోని కోయంబేడు ఫ్లై ఓవర్‌పై రోషన్ తన భార్యపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. అయితే.. ఈ వీడియోను ఫ్లై ఓవర్‌పై ఉన్న…
ఉపాధి కోసం సౌదీ అరేబియాలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్య అక్రమ సంబంధానికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. దీంతో హుటాహుటిన అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ తతంగాన్ని ప్రశ్నించేందుకు స్వదేశానికి వచ్చిన భర్తపై భార్య ప్రియుడితో కలిసి దాడి చేయించింది. ఈ ఘటన యూపీలోని బులంద్‌షహర్‌లోని కొత్వాలి దేహత్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. ఈ క్రమంలో తన మొబైల్…
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఓ కానిస్టేబుల్ ప్రభుత్వ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందే భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణ వార్త తెలిసిన వెంటనే కొన్ని గంటల తర్వాత రైఫిల్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
ఏపీలో ఇటీవల భర్తలు, భార్యల హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతి నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. అయితే భార్యను చంపిన భర్త అని లేదా భర్తను చంపిన భార్య అని.. తాజాగా మరో ఘటన సంచలనంగా మారింది. ఓ భార్య తన భర్తను కడతేర్చింది.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, బావమరిదిని దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం జల్లెడపట్టి అరెస్ట్ చేశారు. కాగా.. హత్య ఘటనపై పోలీసులు విచారించగా.. వారిని హత్య చేయడానికి స్క్రూడ్రైవర్‌ను ఉపయోగించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.