Vizag: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకున్నాడు.. కొంత కాలం తర్వాత మరో యువతి మోజులో పడ్డాడు.. భార్యను నిర్లక్ష్యం చేస్తూ.. ఆ యువతితోనే విడిగా కాపురం పెట్టేశాడు.. తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదనతో ఉన్న భార్య.. తన భర్త ఎక్కడున్నాడో కనిపెట్టింది.. బంధువులతో వెళ్లి.. భర్త రంకును రట్టు చేసింది.. అంతేకాదు.. ఆగ్రహంతో ఊగిపోయి.. భర్తకు బడితపూజ చేసింది..
Read Also: Catch Viral Video: కొండ ప్రాంతాల్లో స్టన్నింగ్ క్యాచ్.. సూర్యకుమార్ క్యాచ్‌తో పోలుస్తున్న అభిమానులు!
విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హరితను ప్రేమించిన వివేక్.. 2020 డిసెంబర్ 17న పెళ్లి చేసుకున్నాడు.. హరితది చోడవరం దరి ఎల్ సింగవరం కాగా.. వివేక్ శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందినవాడు.. ప్రేమించుకున్న ఇద్దరూ.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.. అయితే, కొంత కాలం తర్వాత సాకులు వెతకడం ప్రారంభించాడు.. భార్య పొట్టిగా ఉందని విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.. ఆ క్రమంలో స్పాలో పరిచయమైనా మాధురి అనే యువతితో మళ్లీ ప్రేమలో పడ్డాడు.. వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఇక, ఆ యువతికి స్కూటి, నగలు, విలువైన వస్తువులు ఇలా ఎన్నో కొనిచ్చాడట వివేక్.. భార్య తో గొడవపడి విడాకులకు అప్లై చేశాడు.. కానీ, విడాకులు ఇవ్వకుండానే వేరే యువతీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు..
Read Also: Cricket Viral Video: దురదృష్టం వెక్కిరిస్తే ఇలానే ఉంటుంది మరి.. క్రికెట్ హిస్టరీలో అన్‌లక్కీ ఔట్!
ఇక, తన భర్త వేరే మహిళతో ఉంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య హరిత.. దీంతో.. భర్త అక్రమ సంబంధాన్ని గుట్టు రట్టు చేసింది ఆ ఇల్లాలు.. ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న దాన్ని వదిలేసిందుకు సిద్ధమైన.. భర్త రాసాలీలలు బండారం బట్ట బయలు చేసింది భార్య.. ప్రేమించి పెళ్లి చేసుకొని మొహం చాటేసిన భర్త.. సీతమ్మదారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మరో మహిళతో మకాం వేశాడు.. బంధువులతో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు.. భర్త అతడి ప్రియురాలుపై.. భార్య, బంధువులు దాడి చేసి నిలదీశారు.. దీంతో.. ప్లాట్ నుండి ప్రియురాలు మధు పారీపోయింది.. ఇక, భర్తను పట్టుకొని విశాఖ నుండి బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు బంధువులు..