N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
- ప్రస్తుత పదవీకాలం తర్వాత టాటా సన్స్ చైర్మన్‌గా పునర్నియామకం కోరుకోవడం లేదని స్పష్టం
- 2027 ఫిబ్రవరి 20 వరకు ప్రస్తుత చైర్మన్‌గా ..
- చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
N Chandrasekaran: టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి చైర్మన్‌గా నియమితులయ్యేందుకు తాను ఆసక్తి చూపడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే 2027 ఫిబ్రవరి 20 వరకు ప్రస్తుత పదవీకాలంలో కొనసాగుతానని వెల్లడించారు. దీంతో టాటా గ్రూప్ తదుపరి చైర్మన్ ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.
చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్‌లో చేరారు. 2009లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం టాటా సన్స్ ఆధ్వర్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, ఎయిర్ ఇండియా సహా 30కి పైగా కంపెనీలు ఉన్నాయి. చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. ఆ తర్వాత మరో ఐదేళ్ల కాలానికి ఆయనను కొనసాగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు ఏకగ్రీవంగా సిఫారసు చేశాయి. ఈ ప్రతిపాదనను టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ, బోర్డు కూడా పరిశీలించి సిఫారసు చేశాయి.
Also Read
- BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
- El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
- RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
అయితే ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఒక బోర్డు సభ్యుడు మద్దతు ఇవ్వకపోవడంతో నిర్ణయం ముందుకు సాగలేదు. అప్పటి నుంచి ఆరు నెలలు గడిచినా దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఏకగ్రీవ మద్దతు లేని పరిస్థితిలో పునర్నియామకంపై నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నానని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటా సన్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పలు కీలక వ్యూహాత్మక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నందున నాయకత్వంపై ముందుగానే స్పష్టత ఉండటం అవసరమని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో తన పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకం కోసం తన పేరును ప్రతిపాదించకూడదని నిర్ణయించుకున్నట్లు టాటా సన్స్ బోర్డుకు చంద్రశేఖరన్ తెలియజేశారు. అలాగే తన వారసుడిని వీలైనంత త్వరగా ఎంపిక చేసి, నాయకత్వ మార్పు సజావుగా జరిగేలా చూడాలని బోర్డును కోరారు. చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. టాటా సన్స్‌లో 66% వాటా టాటా ట్రస్ట్స్‌దే. టాటా గ్రూప్‌లోని కీలక కంపెనీలపై టాటా సన్స్ నియంత్రణ కలిగి ఉంది.
చంద్రశేఖరన్ 40 ఏళ్లుగా టాటా గ్రూప్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2027 ఫిబ్రవరిలో ప్రస్తుత పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత వైదొలగనున్నారు.
తాజావార్తలు
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!