COVID-19: మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నాలుగు వారాల్లో కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ(WHO) తెలిపింది. నెల వ్యవధిలోనే 8,50,000 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పింది. 3000 మరణాలు సంభవించినట్లు పేర్కొంది.
గత రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది. అయితే, ఇప్పటికే మూడు వేవ్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Carona : దేశంలో కరోనా మరోసారి తన ప్రతాపం చూపుతోంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN-1 నిర్ధారణ అయిన తర్వాత, ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ విధించింది.
కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల పెరుగుదల హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. 24 గంటల వ్యవధిలో 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కు చేరిందని తెలిపింది కేంద్రఆరోగ్య శాఖ. మొన్నటి వరకు…
గతేడాది ప్రపంచాన్ని కలవరపెట్టిన మంకీపాక్స్ మరోసారి విజృంభిస్తోంది. ఆఫ్రికా దేశం కాంగోలో వ్యాధి విస్తరించడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కాంగోలో విస్తరిస్తున్న మంకీపాక్స్ స్ట్రెయిన్ శక్తివంతమైందినగా ఉంది. డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని 26 ప్రావిన్సుల్లో 11 ప్రావిన్సుల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరగడంతో పాటు 22 ప్రావిన్సులకు వ్యాధి విస్తరించింది. ఆ దేశంలో 12,500 మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. జనవరి-నవంబర్ మధ్యలో 581 మంది…
Monkeypox: గతేడాది ప్రపంచాన్ని కుదిపేసిన మంకీపాక్స్ వ్యాధి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆఫ్రికా దేశం డెమెక్రాట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ లైంగికంగా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ప్రస్తుతం ఆ దేశంలో అతిపెద్ద వ్యాప్తి నమోదైంది. ఈ దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. బెల్జియం దేశానికి చెందిన నివాసిమార్చిలో కాంగోకు వెళ్లారని, కొద్ది సేపటికే మంకీపాక్స్ పాజిటివ్ అని తేలిందని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ గురువారం తెలిపింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ మొదలై నెల రోజులు గడిచాయి. హమాస్ ను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేంది లేదని స్పష్టం చేసింది. అయితే గాజాలోని ఆస్పత్రులను ఇజ్రాయిల్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఆర్మీ చుట్టుముట్టింది. ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్ గా వాడుకుంటోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అందుకే వాటిని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అల్ షిఫా ఆస్పత్రి చుట్టు ఇజ్రాయిల్ తన ట్యాంకుల్ని మోహరించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్దంతో గాజాలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో గాజా స్ట్రిప్ లో ఆరోగ్య సామాగ్రి, ఇంధనం యొక్క సురక్షితమైన రవాణాను సులభతరం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్షణ మానవతా కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది
Israel Hamas War: గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కనీసం 500 మంది పౌరులు మరణించారు. అనేక ముస్లిం దేశాలు ఈ దాడికి ఇజ్రాయెల్ నే దోషిని చేశాయి.
Pollution: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. ఈ కాలుష్యం రానున్న కాలంలో ఢిల్లీ వాసులపై పెను ప్రమాదాన్ని మోపుతుందని తాజా అధ్యయనంలో తేలింది.