Carona : దేశంలో కరోనా మరోసారి తన ప్రతాపం చూపుతోంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN-1 నిర్ధారణ అయిన తర్వాత, ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ విధించింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు నమోదయ్యాయి. యుపి, కేరళలో కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. మరోవైపు, భారత్‌తో సహా అనేక దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులపై WHO ఆందోళన చెందుతోంది. కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించాలని పలు దేశాలకు సూచించింది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం మొదలైంది. ఇటీవల, కరోనా సరికొత్త వేరియంట్ JN-1, కేరళలో నిర్ధారించబడింది. దీంతో కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ అలర్ట్ ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 335 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 1,701కి పెరిగింది.
Read Also:IPL 2024 Auction: వేలంలో భారీప్రైజ్ ఈ ఐదుగురు ఆల్‌రౌండర్లకేనా.. భారత్ నుంచి ఒక్కడే!
గడచిన 24 గంటల్లో దేశంలో ఆందోళనను పెంచింది ఒక్క కరోనా కేసులే కాదు. కరోనా కారణంగా గత 24 గంటల్లో ఐదుగురు మరణించారు. కేరళలో నలుగురు మృతి చెందగా, యూపీలో ఒకరు మరణించారు. కోవిడ్-19 కారణంగా 5,33,316 మంది మరణించగా.. దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతం. కోలుకుంటున్న వారి సంఖ్య 4.46 కోట్లకు (4,44,69,799) పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా అంచనా వేయబడిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. అనేక దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని ప్రభావిత దేశాల్లో నిఘా ఉంచాలని, పరీక్షలను కొనసాగించాలని సంస్థ అభ్యర్థించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ COVID-19 టెక్నికల్ లీడ్ అయిన డాక్టర్ మరియా వాన్ కెర్‌ఖోవ్ వీడియోను కూడా WHO విడుదల చేసింది. కరోనా కేసులు పెరగడానికి గల కారణాలను వివరించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పారు.
Read Also:Indian Heroes: మన హీరోల దెబ్బకి ఆక్వామన్ కూడా కనిపించట్లేదు
కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీ ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లు ధరించాలని సింగపూర్ ప్రజలను ఆదేశించింది. డిసెంబర్ 3 – 9 మధ్య కోవిడ్-19 కేసుల సంఖ్య 56,043కి పెరిగిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది గత వారం 32,035 కేసుల కంటే 75 శాతం ఎక్కువ. కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన వారి సగటు సంఖ్య 225 నుండి 350కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH) ఒక సలహాను జారీ చేసింది. చాలా కేసులు JN.1 వేరియంట్‌తో సంక్రమించాయి.