నాన్ వెజ్ అంటే గుర్తుకు వచ్చేది చికెనే.. రుచిగా ఉండటంతో పాటు అందరికి అందుబాటులో ఉంటుంది.. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు లోట్టలేసుకుంటూ తింటారు.. ఇంకొందరు రకరకాల వెరైటీలను చేసుకొని మరీ తింటారు.. కొంతమంది చికెన్ లేకుండా ముద్ద కూడా ఎత్తరంటే అతిశయోక్తి కాదు. అంతలా చికెన్‌కి బానిసలుగా మారిపోతున్నారు కొందరు.. అది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఈ చికెన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అత్యంత భయంకరమైన…
మెక్సికోలో కాస్మెటిక్ సర్జరీలతో సంబంధం ఉన్న ఫంగల్ మెనింజైటిస్ వ్యాప్తిపై ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని అమెరికా, మెక్సికోలోని అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకి విజ్ఞప్తి చేసింది.
Monkeypox: కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని అంతగా భయపెట్టిన వ్యాధి మంకీపాక్స్. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వ్యాధి వేల మందికి వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ ప్రకటించింది.
ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం, పారామిలిటీరీ మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు దళాల పోరు తారాస్థాయికి చేరడంతో వందలాది మంది మరణించారు.
H3N8 Bird Flu: మానవుల్లో అత్యంత అరుదుగా కనిపించే బర్డ్ ఫ్లూతో చైనాలో ఒకరు మరణించారు. ప్రపంచంలోనే ఇలా మరణించడం ఇదే మొదటిసారి. అయితే ప్రజల నుంచి ప్రజలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. దక్షిణ ప్రావిన్స్ ఆఫ్ గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా H3N8 సబ్‌టైప్ బారిన పడిన మూడవ వ్యక్తి అని డబ్ల్యూహెచ్ఓ మంగళవారం తెలిపింది.
Care Hospital: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 102 సంవత్సరాల ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తికి కేర్ ఆస్పత్రి తరపున సత్కరించింది. గురువారం కేర్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగంలో జరిగిన హెల్త్ ఫర్ అల్ కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (WHD) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాధాన్యతా ప్రాంతాన్ని హైలైట్ చేయడానికి ఒక థీమ్‌ని ఎంపిక చేస్తారు.
Around 1 in 6 people worldwide experience infertility: ప్రతీ ఆరుగురిలో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) తన కొత్త నివేదికలో పేర్కొంది. మొత్తం వయోజన జనాభాలో 17.5 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు తెలిపింది. ఈ సమస్యను అధిగమించేందుకు సంతాన సాఫల్యత చర్యలను చేపట్టాలని, అవి అందరికి అందుబాటులో ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
Maternal Mortality: ప్రసూతి మరణాల రేటు గత 20 ఏళ్లలో మూడో వంతు తగ్గినప్పటికీ.. గర్భం, ప్రసవ సమస్యల కారణంగా ప్రపంచంలో ప్రతీ రెండు నిమిషాకలు ఓ మహిళ మరణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. 2000 నుంచి 2015 మధ్య మరణాల రేటు గణనీయంగా పడిపోయినప్పటికీ.. 2016-2020 మధ్య అలాగే స్థిరంగా ఉన్నట్లు, కొన్ని ప్రాంతాల్లో పెరిగినట్లు యూఎన్ తెలిపింది.
ప్రపంచంలో వైరస్‌ల వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. అనేక వైరస్‌లు నేడు ప్రజలపై వాటి ప్రభావాలు చూపుతుండగా.. ప్రస్తుతం మార్బర్గ్ అనే మరో వైరస్ కూడా వచ్చి చేరింది.
టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాల తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 33 వేల మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.