Europe : ఐరోపా ప్రజలలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల కలిగే హాని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన నివేదికను షేర్ చేసింది.
బర్డ్ ఫ్లూ (H5N2) వైరస్ తో ఒక వ్యక్తి మరణించారని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెంటనే ఈ ప్రకటనను వెనక్కు తీసుకుంది. మరణించిన వ్యక్తికి ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని ధృవీకరించింది. పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించిన ఆ వ్యక్తికి దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, టైప్ 2 మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు, దేశంలో కొన్ని రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది.ఈ మరణం బహుళ-కారకాల కారణాలతో జరిగింది, H5N2కి…
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.
Saudi Arab : సౌదీ అరేబియాలో అంతు చిక్కని రోగం వేగంగా ప్రబలుతుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి ఏప్రిల్ 10 - 17 మధ్య, దేశంలో ప్రమాదకరమైన వ్యాప్తి చెందుతున్న మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) కరోనావైరస్ మూడు కేసులు కనుగొనబడ్డాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యూరోపియన్ శాఖ ఇవాళ (గురువారం) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కౌమారదశలో ఉన్నవారిలో ఆల్కహాల్, ఈ-సిగరెట్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపింది.
ఇండియాలో 2022లో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ ఏడాది సుమారు 9.1 లక్షల మంది క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోయారు. అయితే, భారతీయుల్లో ఎక్కువ శాతం రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్కయ సంస్థ వెల్లడించింది.
Cholera Outbreak: ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 400 మందికి పైగా మరణించారు. మరో 10,000 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలింది. కలరా భయంతో పాఠశాలల్ని మూసేసింది అక్కడి ప్రభుత్వం. సామూహిక టీకా కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. దేశ రాజధానిలో ఫుట్‌బాల్ స్టేడియంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేసింది.
Corbevax: భారత తయారీ కోవిడ్ వ్యాక్సిన్ ‘కార్బెవాక్స్’ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చింది. కార్బెవాక్స్ టీకాను హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బయోలాజికల్ E లిమిటెడ్ తయారు చేసింది. దీనిపై బయోలాజికల్ E డైరెక్టర్ మహిమా దాట్ల మాట్లాడుతూ..WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) పట్ల మేము సంతోషంగా ఉన్నామని, ఈ నిర్ణయం కోవిడ్-19కి వ్యతిరేకంగా మా ప్రపంచ పోరాటాన్ని బలపరుస్తుందని అన్నారు.
Corona : మళ్లీ కరోనా కేసులు రావడం మొదలయ్యాయి. ఈసారి మరో కొత్త వేరియంట్‌తో ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేస్తోంది. గత నెలలో అంటే డిసెంబర్‌లో కరోనా కారణంగా 10,000 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది.
WHO: పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంత దేశాలకు నిఘా పెంచాలని విజ్ఞప్తి చేసింది. కోవిడ్ 19, దాని కొత్త ఉప-వ్యాధి వేరియంట్ JN.1, ఇన్ఫ్లుఎంజాతో సహా శ్వాసకోశ వ్యాధుల కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నివారణ చర్యలు తీసుకోవాలని WHO ప్రజలను కోరింది.