COVID-19: మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నాలుగు వారాల్లో కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ(WHO) తెలిపింది. నెల వ్యవధిలోనే 8,50,000 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పింది. 3000 మరణాలు సంభవించినట్లు పేర్కొంది.
Read Also: DD3 Concept Poster : ధనుష్ డైరెక్షన్ లో రానున్న మూడో సినిమా.. కాన్సెప్ట్ పోస్టర్ అదిరిందిగా..
కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది డిసెంబర్ 17 నాటికి ప్రపంచవ్యాప్తంగా 77.2 కోట్ల కేసులు నమోదవ్వగా.. 70 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. మరోవైపు మనదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో JN.1, BA.2.86 Omicron వేరియంట్ యొక్క విజృంభిస్తోంది. దీంతో కేసుల సంఖ్య గతంలో పోలిస్తే పెరుగుతున్నాయి.
మన దేశంలో ఇప్పటి వరకు JN.1 వేరియంట్ కేసులు 22 నమోదయ్యయాని, గోవాలో 21, కేరళలో ఒక కేసు నమోదైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వేరియంట్ వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని, చాలా వరకు ఇంట్లోనే సాధారణ లక్షణాలతో కోలుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ.. వచ్చే ఫెస్టివల్ సీజన్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.