Coronavirus in India: కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల పెరుగుదల హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. 24 గంటల వ్యవధిలో 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కు చేరిందని తెలిపింది కేంద్రఆరోగ్య శాఖ. మొన్నటి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100 గా ఉంది. చలికాలం కావడంతో ఇన్‌ప్లూయెంజా లాంటి వైరస్‌ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. ఇటీవల కరోనా పాజిటివ్‌తో సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఓ మహిళ మృత్యువాత పడినట్లు వెల్లడించింది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు జూలైలో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. 2023 జూలై 24న కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే రికార్డయ్యాయని తెలిపారు. మొత్తానికి సడెన్ గా కరోనా కేసులు పెరగడంపై కేంద్రం అలర్టయ్యింది. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు సైతం సూచిస్తున్నారు.
2020లో కరోనా మిగిల్చిన విషాదాన్ని ప్రపంచం ఎన్నడూ మరువదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్… ఇలా మూడు దశల్లో ఆ మాయదారి మహమ్మారి… ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలిగొంది. కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. జీవితాలను ఆగమాగం చేసింది. కన్నవారిని కాటేయడంతో… ఎంతోమంది చిన్నారులు అనాథలయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. అది మిగిల్చిన నష్టాల నుంచి ఇప్పటికీ కోలుకోని పలు దేశాలు… సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చి కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాక… దాని పీడ విరగడ అయిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలా రాక్షస రోగం ఊసు కూడా మరిచిపోయారు. ఇలాంటి తరుణంలో… దేశంలో మళ్లీ కరోనా కొత్త కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
ప్రపంచాన్నే వణికించిన కరోనా పేరు చెబితే చాలు… అంతా భయంతో వణికిపోయేవారు. అయితే రానురాను కొవిడ్ వైరస్ ప్రభావం తగ్గిపోవడంతో… దాని గురించి చర్చించుకోవడమే మానేశారు. అయితే ప్రస్తుతం చలికాలం ప్రారంభమవడంతో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇటీవలి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100 గా ఉన్నదని, ఇప్పుడు శీతాకాలం కావడంతో ఇన్‌ప్లూయెంజా లాంటి వైరస్‌ల కారణంగా కేసుల సంఖ్యలో పెంపు కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇటీవల కరోనా పాజిటివ్‌లో సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఓ మహిళ మృత్యువాత పడినట్లు పేర్కొంది. చలికాలం కావడంతో ఇన్‌ప్లూయెంజా లాంటి వైరస్‌ల కారణంగా రోజువారీ నిర్ధారణ అయ్యే కరోనా కేసుల సగటు 100 దాటుతోందని తెలిపింది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు జూలైలో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. 2023 జూలై 24న కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా 24 గంటల వ్యవధిలో అధికంగా 166 కేసుల నమోదు కావడం కలకలం రేపుతోంది.
కరోనా పుట్టినిల్లు చైనా. 2019 సంవత్సరం చివరలో… తొలుత చైనాలోనే కొవిడ్ వైరస్ బయటపడింది. అది సోకిన వారిని స్పృశించడం ద్వారా ఎక్కువ మందికి వైరస్ సోకింది. గాలి విషంగా మారింది. వైరస్‌తో బాధపడేవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కరోనా కోరలు చాచింది. భారత్‌లో 2020 జనవరి 7న కరోనా తొలి కేసు కేరళలో బయటపడింది. అప్పుడు తొలి కేసు కేరళలోని త్రిస్సూర్ జనరల్ ఆస్పత్రిలో నమోదైంది. నాడు 20 ఏళ్ల వయసున్న మహిళకు వైరస్ లక్షణాలు కనిపించడంతో… ఆమె శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపారు. ఆ మహిళకు సోకింది కరోనాయేనని నిర్ధారణ జరిగేలోపే… దేశంలో దాని వ్యాప్తి అధికమైంది. ఇప్పుడు మళ్లీ కొత్త కేసుల నమోదు కూడా కేరళలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. కాగా, కరోనా మహమ్మారి దేశంలో కాలు మోపినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.44 కోట్లకు చేరింది. మరణాల సంఖ్య 5 లక్షల 33 వేల 306 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి 4 కోట్ల 44 లక్షల 68 వేల 775 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ డాటా ప్రకారం దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోసుల కరోనా టీకాలు వేశారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 50 లక్షల ,02 వేల 889 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిసింది. ఇక WHO గణాంకాల ప్రకారం… ఈ ఏడాది నవంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల 21 లక్షల 38 వేల 818 కరోనా కేసులు నమోదయ్యాయి. 69 లక్షల 85 వేల 964 మరణాలు సంభవించాయని WHO వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని బలిగొన్న కరోనా మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో, భారత్‌లో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. వాటి సంక్రమణ కూడా కాస్త భయాందోళనను కలిగిస్తోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత… చైనాలో ఒక రహస్యమైన న్యుమోనియా ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీనికి సంబంధించి దేశంలో కొన్ని పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. న్యుమోనియా ఇన్ఫెక్షన్, కరోనా వైరస్ సోకినవారికి లక్షణాలు దాదాపు ఒకటే ఉండటంతో… అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇంతలోనే ఇప్పుడు దేశంలో మరోసారి కరోనా తిరగబడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా చలికాలంలో ఇన్‌ప్లూయెంజా వంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే, 2020 జనవరిలో భారత్‌లో కరోనా తొలి కేసు నమోదుకు ముందు కూడా… చాలా మంది శీతాకాలంలో వచ్చే వ్యాధుల లక్షణాలతోనే కనిపించారు. ఆ సమయంలో కరోనాపై అంతగా అవగాహన లేకపోవడంతో… ఆ వైరస్ వేగంగా వ్యాపించింది. చైనాలో కేసుల సంఖ్య పెరిగాక… అది ఎక్కువగా స్పృశించడం ద్వారానే విస్తరిస్తోందని తెలిశాక… జాగ్రత్తలు పాటించారు. మనిషికి మనిషికి మధ్య కనీసం మీటరు కంటే ఎక్కువ దూరం ఉండటం, ముక్కు, నోటికి తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడం, చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం, గుంపులు గుంపులుగా లేకుండా చూడటం వంటి చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అప్పుడు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో… ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది.
కరోనా ఫస్ట్ వేవ్‌లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో… జనాలు పిట్టల్లా రాలిపోయారు. ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. కరోనా కట్టడికి చేపట్టిన ప్రాథమిక చర్యలేవి వైరస్ వ్యాప్తిని నియంత్రించలేకపోయాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే మన దేశంలో… డిస్టన్స్ మెయింటైన్ చేయడం సాధ్యమయ్యే పనిగా అనిపించలేదు. దీంతో అప్పుడు అంటే 2020 మార్చి 25న దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించారు. ఎక్కడివారు అక్కడే ఉండాలని, బయట తిరగడానికి వీల్లేదని, ఎమర్జెన్సీ సర్వీసుల వారు తప్ప… మిగతా వారెవ్వరూ బయటకు రావొద్దని ఆదేశించారు. బయట కనిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కఠినమైన ఆంక్షలు విధించారు. అలా తొలుత 21 రోజుల పాటు కొనసాగిన లాక్‌డౌన్… ఆ తర్వాత విడతల వారీగా పెరిగింది. వైరస్ తీవ్రత తగ్గేకొద్ది… లాక్‌డౌన్ ఆంక్షల్లోనూ సడలింపు ఇచ్చారు. ప్రపంచ జనాభాలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్‌లో… కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ చర్య… చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చింది. సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత ఉన్నప్పటికీ… మరణాల రేటు తగ్గింది. ఇక థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం అంతగా కనిపించలేదు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ 2021 జనవరి 16 నుంచి అందుబాటులోకి వచ్చింది. కరోనా రకాన్ని బట్టి వ్యాక్సిన్లు వచ్చాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ పంపిణీ చేశాయి. ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకున్నాయి. కరోనా మూడో దశలోనూ… మరోసారి వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. కరోనా కేసులు తగ్గినప్పటికీ… జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేశారు. అయితే, దేశంలో ఈ ఏడాది జూలైలో 24 కేసులు నమోదైన తర్వాత పెరగని కరోనా… ఇప్పుడు మళ్లీ అధికమవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా 24 గంటల్లో 166 కేసులు నమోదు అవడంతో…. కరోనా మళ్లీ కోరలు చాస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందులోనూ ఇప్పుడు శీతాకాలం కావడంతో… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, కరోనా జాగ్రత్తలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.