దేశంలో సీజనల్, ధీర్ఘకాలిక వ్యాధుల భారిన పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ కాక, సరైన చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, మధుమేహం, క్యాన్సర్, నవజాత శిశువుల సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధులలో చాలా వరకు సకాలంలో గుర్తించడం ద్వారా నివారించవచ్చు. ఏ వ్యాధి నుండి మరణం అకస్మాత్తుగా జరగదు. అవగాహన లేకపోవడం, పేలవమైన జీవనశైలి, ఆలస్యమైన…
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంతో సహా 20 కి పైగా దేశాలలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గత రెండు-మూడు సంవత్సరాల కంటే ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా? వైరస్‌లో ఏదైనా ప్రమాదకరమైన మ్యుటేషన్ జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Covid cases: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం, దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన పెంచుతోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఇటీవల భారతదేశంలో కనుగొనబడ్డాయి. ఏప్రిల్‌లో తమిళనాడులో NB.1.8.1 కేసు ఒకటి నమోదైంది, మేలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు.
Obesity Causes: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఊబకాయం (Obesity) ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన అలవాట్లు ఇవన్నీ బరువు పెరగడానికి ప్రధాన కారణాలు. ఊబకాయం మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్ల సమస్యలు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 4న “ప్రపంచ ఊబకాయ…
ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన కాంగోలో ఓ వింత వ్యాధి హడలెత్తిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 50 మంది మరణించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే రోగులు మరణిస్తున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో ఈ వ్యాధి మొదట గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Pneumonia : కాథలిక్ క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం కాస్త నలతగా ఉందని సమాచారం. 87 ఏళ్ల పోప్ ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రిలో చేరారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ యెమెన్‌లో గల సనాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించాగా.. పలువురికి గాయాలు అయ్యాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదికలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓ నీట మునిగి చనిపోయిన మరణాలు, వాటి నివారణపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా నీట మునగడం వల్ల సంభవించే మరణాల రేటులో 38% శాతం తగ్గింది. అయినప్పటికీ.. తక్కువ ఆదాయ దేశాలలో ఈ ముప్పు ఇప్పటికీ చాలా తీవ్రంగా ఉంది. కాగా.. ప్రతి గంటకు సగటున 30 మంది మరణిస్తున్నట్లు తేలింది. మునిగి చనిపోవడాన్ని…
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి కొన్ని అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఇవి తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపి రోగాల బారిన పడుతున్నారు. ఇంతకీ.. డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన జాబితాలో అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల వచ్చే రోగాల గురించి తెలిపింది.
WHO Trachoma Free India: ట్రాకోమా.. అంటే క్లామిడియా ట్రాకోమాటిస్ వైరస్ వల్ల కలిగే కంటి వ్యాధి. ప్రపంచంలోని ప్రజలు పాక్షికంగా అంధత్వానికి ప్రభావితమవుతారు. ఈ వ్యాధి చేతులు, బట్టలు, పరుపులు లేదా గట్టి ఉపరితలాల ద్వారా ద్వారా వ్యాపిస్తుంది. ఇది కంటికి నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా కార్నియాను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇకపోతే ఈ ఏడాదిలో భారతదేశ ఆరోగ్య రంగం పెద్ద విజయాన్ని సాధించింది. దేశం ఇప్పుడు ట్రాకోమా వ్యాధి నుండి విముక్తి పొందింది. ప్రపంచ ఆరోగ్య…