నేడు సీపీఎం నేత బృందా కారాట్ ఆదిలాబాద్ నగరంలో పర్యటించనున్నారు. సీఐటీయూ కార్యాలయ ప్రారంభంతో పాటు సభలో పాల్గొననున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. నేడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆర్జీవీ నాలుగు రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. వర్మ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మహారాష్ట్ర సీఎం ఎవరన్నది బీజేపీ హైకమాండ్ నేడు తేల్చబోతోంది. ఏక్నాథ్ షిండే…
ఢిల్లీ: నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవన్లో ఇండి కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల భేటీ. అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్న భాగస్వామ్యపక్షాలు. డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. చంద్రబాబు, పవన్పై అసభ్యకర పోస్టుల కేసులో ముందస్తు బెయిల్ కోరిన ఆర్జీవీ. అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి…
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. నేడు, రేపు జరిగే గ్రూప్-3 పరీక్షల కోసం సెంటర్ల వద్ద కఠిన చర్యలను చేపట్టింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచన చేసింది. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడీ(పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్)లను చూపించాల్సి ఉంటుంది. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా…
నేడు నాల్గవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. కడపలో త్రాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన గ్రామాలలో కనీస సదుపాయాలు, విద్యాశాఖలో ఖాళీలు.. అంశాలపై చర్చలు జరగనున్నాయి. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు మధ్యాహ్న ఒంటి గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. ఉదయం…
బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం. నేడు ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు. హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,850 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,450 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,01,000 లుగా ఉంది. నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ. నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక.…
నేడు గుంటూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పవన్ గుంటూరు చేరుకోనున్నారు. నగరం పాలెంలోని అరణ్య భవన్లో అటవీ అమరవీరుల సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ నందు APMSA స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి వరకు పలు కార్యక్రమాలలో మంత్రి కందుల…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై సమస్త అధికార యంత్రాంగానికి సీఎం దిశా నిర్ధేశం చేయనున్నారు. ఏపీ ఉప…
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈదుపురంలో దీపం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. నేడు ఏలూరు ద్వారకా తిరుమల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐయస్ జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పవన్ దర్శించుకోనున్నారు. అనంతరం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయనునున్నారు. నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లా రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. పాయింట్లకు…
నేడు విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా బాధితులకు అయన పరామర్శిస్తారు. ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ఎస్ఆర్ పేట మంచినీటి పథకంను పరిశీలిస్తారు. నేటి నుండి 27 వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి…