ఈరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సీఎం చంద్రబాబు దుర్గగుడికి వెళ్లనున్నారు. నూతన సంవత్సరం నేపథ్యంలో కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం టీడీపీ కేంద్రకార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
నేటి నుండి దక్షిణ మధ్య రైల్వే నూతన పబ్లిక్ టైమ్ టేబుల్ అమలు కానుంది. రైలు సమయాల్లో మార్పును ప్రయాణికులు గమనించగలరని అధికారులు కోరారు.
నేడు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురంలో పర్యటించనున్నారు. ఉరవకొండ పట్టణానికి శాశ్వత మంచినీటి పథకం కింద రూ.16 కోట్ల 35 లక్షల రూపాయలతో ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయంలో సంపు ఏర్పాటు కోసం భూమి పూజ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత పర్యటించనున్నారు.
నేడు కడప జిల్లాలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పర్యటించనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాలలో భాగంగా రెండవ రోజు కూర్మవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమివనున్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.