Rajini – Sharukh: రజనీకాంత్, షారూక్ ఖాన్ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ప్రపంచంలో అసాధ్యం అనుకున్న కాంబినేషన్లు తెరపైకి వచ్చినప్పుడు వచ్చే కిక్కే వేరు. ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తే చూడాలని దశాబ్దాలుగా అభిమానులు కలలు కన్నారు. అది ఇప్పుడు మెల్లగా సాకారం అవుతున్న వేళ, అంతకు మించిన మరో మెగా డ్రీమ్ కాంబినేషన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ టాక్ మొదలైంది. దక్షిణాది ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మరియు బాలీవుడ్ ‘బాద్షా’ షారూక్ ఖాన్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్నది కోట్లాది మంది అభిమానుల కోరిక. ఇప్పుడు ఆ కోరికను నిజం చేసే బాధ్యతను సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:Tollywood : యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న మాస్ బీట్ సాంగ్స్
Also Read
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్‌ను “మీ డ్రీమ్ కాంబినేషన్ ఏంటి?” అని అడిగితే, ఆయన ఏమాత్రం ఆలోచించకుండా రజనీకాంత్, షారూక్ ఖాన్ పేర్లు చెప్పారు. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే సినిమాలో చూపిస్తూ తాను సంగీతం అందించడమే తన జీవిత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. షారూక్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘జవాన్’కు, రజనీకి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన ‘జైలర్’కు అనిరుధే సంగీతం అందించడం విశేషం. వరుస ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్‌కు ‘జైలర్’తో హిమాలయమంత విజయాన్ని అందించిన నెల్సన్, ఇప్పుడు ‘జైలర్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, రజనీ మరియు షారూక్‌లను కలిపే ఆ అద్భుతమైన కథను నెల్సన్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ లెజెండ్రీ కాంబినేషన్ సినిమాను 2027లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్, షారూక్ ఖాన్ గతంలో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసినా, పూర్తిస్థాయిలో కలిసి నటించి దాదాపు 47 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి నటిస్తున్నారన్న వార్త కేవలం సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా పెను సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?