గుంటూరు: నేడు విజ్ఞాన్ యూనివర్శిటీలో రైతు నేస్తం కార్యక్రమం. పాల్గొననున్న మంత్రి అచ్చెన్నాయుడు.
ఏపీలో నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన కార్యక్రమం. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పాల్గొననున్న మంత్రి లోకేశ్.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ. రైతు భరోసా విధివిధానాలకు ఆమోదం తెలపనున్న సర్కార్. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చలు. కొత్త ఇంధన పాలసీపై చర్చిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి.
నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు. నేవీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు. సాయంత్రం 4.15కి ఆర్కే బీచ్ చేరుకోనున్న చంద్రబాబు దంపతులు. సందర్శకుల కోసం బీచ్‌రోడ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు.
నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,210 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,610 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,00,100 లుగా ఉంది.
తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత. రెండు రోజులుగా అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి పంజా. కొమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్. ఆదిలాబాద్‌లో 7.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత. పటాన్‌చెరులో 8.4, రామగుండంలో 12.8 డిగ్రీలు. హనుమకొండలో 13, హైదరాబాద్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రత.
తమిళనాడులో నేటి నుంచి జల్లికట్టు పోటీలు ప్రారంభం. పుద్దుకోట్టె జిల్లాలో నేడు జల్లికట్టు పోటీలు. పోటీల్లో పాల్గొననున్న 600 ఎద్దులు, 300 మంది యువకులు. భారీ బందోబస్తు, ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు.
నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల బైక్ ర్యాలీ. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించాలని డిమాండ్.
రాజమండ్రిలో నేడు గేమ్‌ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.