ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా మండలి సమావేశాలు సాగుతున్నాయి. ఇవాళ విచారణకు రావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వనుంది. కాకినాడ సీ పోర్టు షేర్లు బదిలీ వ్యవహారంపై విజయ సాయిరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు పార్టీ జెండాను అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు.…
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళలకు కొత్త పథకం ప్రకటించే అవకాశం ఉంది. నేడు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్‌తో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అప్పులు, ఉపాధ్యాయ పోస్టులు, వైజాగ్ టీడీఆర్ బాండ్లు, సీజనల్ హాస్టళ్ల ఏర్పాటు అంశాలపై సభ్యుల ప్రశ్నలు ఆగడనున్నారు. నేడు తాడేపల్లి నుంచి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్…
నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న అనంతరం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. బెజవాడలో నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంకు నారా భువనేశ్వరి హాజరుకానున్నారు. సీఐడీ నోటీసుపై స్టే ఇవ్వాలని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్లు మీద నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది.…
ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక వివాహ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలు, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై మీడియాతో జగన్ మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మండలిలో టీడీపీ, సభ్యుల మాటల యుద్ధం…
ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2025-26 ఏపీ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు లాంటి పూర్తి అంశాలపై చర్చించనున్నారు. మండలిలో బడ్జెట్‌పై చర్చకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్పులు, సూపర్ సిక్స్ అమలు వంటి వివిధ అంశాలను వైసీపీ సభ్యులు లెవనెత్తె ఆలోచనలో ఉన్నారు. ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి ఫ్లైట్‌లో 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి జగన్…
నేడు ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నేటితో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగియనుంది. ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి జైల్లో వంశీని పోలీసులు అప్పగించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోని గాదె…