వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీ కోసం నేడు మున్సిపల్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను త్వరితగతిన జారీ చేసేలా ప్రణాళిక చేయనుంది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సవిత పాల్గొననున్నారు.
నేడు మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు మిర్చియార్డు వద్ద రైతు సంఘాలు ఆందోళన చేపట్టనున్నాయి.
తిరుపతి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం తిరుమండ్యం గ్రామం, వడమాలపేట మండలంలో వరిధాన్య సేకరణ కేంద్రం పరిశీలన చేసి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
నేడు కర్నూలు APERC ఆఫీస్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన జరగనుంది. ఈ ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొననున్నారు.
ఈరోజు, రేపు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించనున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్నారు.
ఇవాళ బెంగుళూరుకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు.
నేడు భద్రాచలం రామాలయంలో ధ్వజహరణంతో సీతారాముల కళ్యాణం ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు ఉత్తర ద్వారదర్శనం వద్ద ఎదుర్కోలు జరగనుంది.
నేడు ఖమ్మం జిల్లాలో పలు ఆభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేయనున్నారు. ధాన్యం కేంద్రాలను మంత్రి ప్రారంభించనున్నారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా కమిషన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
నేటితో పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు సాగాయి.
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది.