నేడు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం.. సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున జరగనున్న రాముల వారి కళ్యాణం
ఇవాళ బెంగుళూరుకు వెళ్లనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్
నేడు కడప జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణోత్సవంలో పాల్గొననున్న సీఎం
ఈరోజు విజయనగరంలో పర్యటించనున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. ఉదయం 10 గంటలకు పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “జ్యోతిరావు పూలే గారి జయంతి” వేడుకల్లో పాల్గొననున్న మంత్రి
ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్న మంత్రి నారాయణ బృందం.. ఉదయం 11 గంటలకు గాజుల రామారంలోని MSME పార్కు సందర్శించనున్న మంత్రి బృందం
నేడు టీడీపీ నేత చేబ్రోలు కిరణ్‌ను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు.. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్
నేడు నూజివీడులో సీఎం చంద్రబాబు పర్యటన.. ఆగిరిపల్లిలో ప్రజా వేదిక కార్యక్రమాల్లో పాల్గొననున్న చంద్రబాబు
నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి జోగి రమేష్.. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు
తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాల్లో నేడు రోండోవ రోజు.. ఉదయం స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
ఈరోజు ఉదయం 11 గంటలకు అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు
నేటి నుండి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం.. మూడు రోజులపాటు కొనసాగనున్న జాతర
భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
నేడు కాశీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. రూ.3884.18 కోట్లతో శంకుస్థాపనలు
ఐపీఎల్ 2025: నేడు చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్.. ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం