* నేడు నందిగామలో సీఎం చంద్రబాబు పర్యటన.. ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు..
* నేటి సాయంత్రం భద్రాచలానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రేపు రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న పవన్..
* నేడు పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న నాగబాబు..
* నేటి నుంచి కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సంప్రదింపులు జరపనున్న మంత్రుల కమిటీ.. ఈ నెల 16 లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ ను కోరిన సుప్రీం..
హెచ్సీయూ భూముల వివాదంపై సర్కార్ నజర్.. సీఎస్, అటవీ, రెవెన్యూ అధికారులతో చర్చించిన డిప్యూటీ సీఎం భట్టి.. ఇప్పటికే భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటితో కమిటీ..
* నేడు సాయంత్రం 6 గంటలకు స్వీట్ ప్లాంట్ దగ్గర రాస్తారోకో.. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటూ నిరవధిక సమ్మె..
* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో హెపాటైటిస్ సీ వైరస్ నిర్ధారణ పరీక్షలు.. మొదట రాపిడ్ టెస్ట్ నిర్వహిస్తున్న వైద్యులు..
* నేడు ఏపీలో పలు చోట్ల వర్షాలు.. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
* నేటి నుంచి తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాలకు ఆరెంట్ అలర్ట్.. సాధారణం కంటే 2,3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం..
* నేడు కొత్తగూడెంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 80 మందికి పైగా మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు..
* నేడు సాయంత్రం భద్రాచలం రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..
* నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు.. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్.. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. ముల్లాన్ పుర్ వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..