నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. కర్నూలు జిల్లా వైసీపీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
నేడు సదుంలో ఎంపీ మిధున్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీడీవో ఆఫీసులో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.
నేడు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పర్యటించనున్నారు. గావ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా పురంధేశ్వరి పర్యటించనున్నారు.
ఇవాళ నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది.
ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద APSBCL అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించనున్నారు.
నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు.
పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నెల్లూరు పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని పోసాని పిటిషన్ వేశారు.
నేడు తునిలో యనమల రామకృష్ణుడు తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తకం విడుదల చేయనున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
నెల్లూరు జిల్లా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
నేడు భారత్‌కు తహవ్వుర్ రాణా రానున్నారు. ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడిగా తహవ్వుర్ రాణా ఉన్నాడు.
నేటి నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ ‘గావ్ చలో, బస్తీ చలో’ కార్యక్రమం జరగనుంది. వక్ఫ్ సవరణల వల్ల ముస్లింలకు కలిగే ప్రయోజనాలను బీజేపీ వివరించనుంది.
నేడు ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది.