* నేడు అహ్మదాబాద్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు..
* నేడు దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై తెలంగాణ హైకోర్టులో తీర్పు.. 2013లో దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు.. పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు.. 2016లో యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన ముద్దాయిలు.. ఇప్పటికే పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్..
* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సెట్ ముందుకు శ్రవణ్ రావు.. మూడోసారి సిట్ ఎదుట హాజరుకానున్న శ్రవణ్ రావు.. గత ఎన్నికల టైంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని ఇప్పటికే నోటీసులు.. రెండు సెల్ ఫోన్ల కోసం శ్రవణ్ రావుకి నోటీసులు ఇచ్చిన సిట్..
* నేడు అరకులో రెండో రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. విశాఖలో ఎకో టూరిజంపై సమీక్ష..
* నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్..
* నేడు విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్టు నూతన కార్యాలయం ప్రారంభం.. పాస్ పోర్ట్ ఆఫీసును ప్రారంభించనున్న కేంద్రమంత్రి కీర్తివర్థన్ సింగ్.. రోజుకు వెయ్యి స్లాట్లు ఇచ్చేలా పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఆధునీకరణ..
* నేటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు యథాతధం.. తక్షణం రూ. 500 కోట్లు విడుదలకు అంగీకారించిన ఏపీ ప్రభుత్వం..
* నేడు విడదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేశారని ఏసీబీ కేసు..
* నేడు ఐపీఎస్ కాంతి రాణా క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ.. నటి జత్వాని ఫిర్యాదు కేసులో హైకోర్టును ఆశ్రయించిన కాంతి రాణా..
* నేడు అహ్మదాబాద్ లో కాంగ్రెస్ కీలక సమావేశం.. సీడబ్ల్యూసీ, ఏఐసీసీ కీలక సమావేశం.. హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియాలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, కీలక నేతలు..
* నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచులు.. కోల్ కతా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి కేకేఆర్ వర్సెస్ లక్నో మ్యాచ్.. ముల్లాన్‌పూర్ వేదికగా రాత్రి 7.30కు పంజాబ్ vs చెన్నై మ్యాచ్