West Bengal : తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ అరెస్ట్ అయ్యారు. టీఎంసీ నేతను రాత్రి 3 గంటలకు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
రెండు సింహాలకు అక్బర్, సీత (Akbar and Sita) అనే పేర్లు పెట్టడంపై పశ్చిమబెంగాల్లో ఎంత దుమారం చెలరేగిందో తెలిసిందే. విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకించింది.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో సందేశ్‌ఖలీ ప్రాంతంలో మహిళలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. గత రెండు వారాలుగా ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. మహిళల ఆందోళనలకు బీజేపీ మద్దతు ఇచ్చింది. సందేశ్‌ఖలి ఘటన లోక్‌సభ ఎన్నికల ముందు మమతా బెనర్జీకి తీవ్ర ఇబ్బందిగా మారింది.
సార్వత్రిక ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా రాష్ట్ర పర్యటనలతో ప్రధాని మోడీ (PM Modi) బిజిబిజీగా గడుపుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో
West Bengal : ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో పశ్చిమ బెంగాల్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం రాష్ట్రంలోని దాదాపు ఆరు చోట్ల దాడులు చేసింది.
Mamata Banerjee: ‘‘ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది’’.. బీజేపీకి మమత వార్నింగ్..టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ హాయాంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీతో బీజేపీ పాలనను పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి తమ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని మమతా బెనర్జీ ఆరోపించారు.
Sandeshkhali Violence: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీ ప్రాంతం గత కొన్ని రోజులుగా నిరసన, ఆందోళనతో అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహన్ అతని అనుచరులు ఆ ప్రాంతంలో మహిళపై అత్యాచారాలు జరపడంతో ఒక్కసారిగా మహిళలు, యువత టీఎంసీ గుండాలకు ఎదురుతిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిందితులను అరెస్ట్ చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. కొన్ని రోజులుగా ఈ ప్రాంతం బీజేపీ వర్సెస్…
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం రాబోయే లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలోని ప్రజల ఆధార్ కార్డులను ‘డీయాక్టివేట్’ చేసిందని, తద్వారా ప్రజలకు వచ్చే ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు పొందకుండా చేశారని ఆదివారం ఆరోపించారు.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖలీ గత కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో మహిళలు, యువత టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తన నిరసన, ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి బీజేపీ పార్టీ నుంచి సపోర్టు లభిస్తోంది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో రెండు సింహాలకు పెట్టిన పేర్లు వివాదాస్పదమయ్యాయి. త్రిపుర నుంచి బెంగాల్ సఫారీ పార్కుకు తీసుకువచ్చిన ఆడ సింహానికి ‘సీత’ అని పేరుపెట్టడంపై విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) హైకోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టులోని జల్పాయిగురి సర్క్యూట్ బెంచ్ హిందూ సంస్థ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆడ సింహానికి ఎలాంటి పేరు పెట్టలేదని పార్క్ అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు.