పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ దాటికి నలుగురు చనిపోగా.. 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది.
Yusuf Pathan: మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తరుపున ఆయన వెస్ట్ బెంగాల్‌లోని బర్హంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక తన ఇంట్లోనే అత్యాచారానికి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత కొడుకు ఈ దారుణానికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు సందేశ్‌ఖాలీ బాధితురాలు, బీజేపీ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖా పాత్రకి ఫోన్ చేసి మాట్లాడారు. బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బీజేపీ తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది. సందేశ్‌ఖాలీలో ప్రజల మానసిక పరిస్థితి గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. రేఖా పాత్రను ‘శక్తి స్వరూపిణి’గా ప్రధాని మోడీ అభివర్ణించారు. సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళల బాధల్ని, తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకులు వేధింపుల గురించి రేఖ ప్రధానికి…
Bengal BJP: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా 2026 లోపే మమతా బెనర్జీ సర్కార్ పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బెంగాల్ బీజేపీకి సైద్ధాంతిక అంశమని అన్నారు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలను స్వీప్ చేయడానికి ఈ చట్టం సహాయపడుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అవినీతి, అరాచక టీఎంసీని ఓడించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మజుందార్ అన్నారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా.. మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని తాను పోటీ చేస్తోన్న లోక్ సభ నియోజకవర్గం బెర్‌హమ్‌పోర్లో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో కేంద్ర అధికార పార్టీ బీజేపీ, రాష్ట్ర అధికార పార్టీ టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.