West bengal: గవర్నర్-ప్రభుత్వం మధ్య ఘర్షణ.. కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో గవర్నర్-ప్రభుత్వం మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసును మంత్రివర్గం నుంచి తొలగించాలని మమతా బెనర్జీ ప్రభుత్వానికి గవర్నర్ సీవీ. ఆనంద బోస్ సిఫార్సు చేశారు. దీంతో రాజ్‌భవన్-ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. విద్యాశాఖ మంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ గవర్నర్ ఆరోపించారు.
మార్చి 30న గౌర్ బొంగో యూనివర్శిటీలో మంత్రి బ్రత్యా బసు సమక్షంలో రాజకీయ సమావేశం జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలతో బ్రత్యా బసు పొలిటికల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా గవర్నర్ కార్యాలయం భావించింది. దీంతో గవర్నర్ ఆనంద బోస్ ఈ చర్యకు పాల్పడ్డారు. పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి తొలగించాలని రాజ్‌భవన్ కోరింది. ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో రాజకీయ సమావేశాన్ని నిర్వహించడంతో విశ్వవిద్యాలయ వ్యవస్థకు అపఖ్యాతి వచ్చిందని గవర్నర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇది కూడా చదవండి: Iran: భద్రతా బలగాలపై సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడి.. 27 మంది మృతి..
గవర్నర్ చర్యపై మంత్రి బసు మండిపడ్డారు. గవర్నర్ చర్య హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తాను కూడా గవర్నర్‌ను తొలగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తే బాగుంటుందా? అని ప్రశ్నించారు. తాను ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
ఇది కూడా చదవండి:AP Weather: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు
ఇప్పటికే సందేశ్‌ఖాలీ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రాజ్‌భవన్-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎంత వరకు వెళ్తాయో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!