దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. అయితే తాజాగా వాతావరణ శాఖ కొన్ని రాష్ట్రాలకు భారీ ఉష్ణోగ్రతలు, మరికొన్ని రాష్ట్రాలకు వర్ష సూచనలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను వాతావరణ శాఖ విడుదల చేసింది.
ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలలో ఏప్రిల్ 6కు వేడి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు మాత్రం తెలంగాణలో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో మాత్రం వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
ఇక జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలో వచ్చే 7 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాలు కురిస్తే కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.