Sandeshkhali: లోక్‌సభ ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్ సందేశ్‌ఖాలీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఆ ప్రాంతంలోని మహిళలపై మాజీ టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరుల లైంగిక వేధింపులు, అత్యాచారాల ఘటన వెలుగులోకి వచ్చింది. వీరిని అరెస్ట్ చేయాలని అక్కడి మహిళలు పెద్ద ఉద్యమం చేశారు. అయితే, సందేశ్‌ఖాలీ హింసాకాండ, దోపిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దాఖలైన అఫిడవిట్‌ని గురువారం కలకత్తా హైకోర్టు విచారించింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్‌కి రక్షణ కల్పించారని తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చీఫ్ జస్టిన్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం సర్కార్‌ని మందలించింది. ‘‘ఒక్క అఫిడవిట్ కరెక్ట్ అయినా, ఇది సిగ్గు చేటు. ఇందులో ఒక్క శాతం నిజమున్న 100 శాతం సిగ్గుపడాల్సిన విషయం. పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితమైందా..?’’ అని అన్నారు. మొత్తం జిల్లా యంత్రాంగంతో పాటు అధికార పార్టీ 100 శాతం నైతిక బాధ్యత కలిగి ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: DMK: జనరల్ బిపిన్ రావత్ చనిపోతే ప్రధాని ఎందుకు రాలేదు.. ఏ.రాజా విమర్శలు..
షేక్ షాజహాన్ తరుపున వాదిస్తున్న లాయర్‌ని కోర్టు తీవ్రంగా మందలించింది. ఈ కేసులో నిందితుడు 55 రోజుల పాటు తప్పించుకుని తిరిగాడు, చివరకు హైకోర్టు కలుగజేసుకుని, అతడిని అరెస్ట్ చేసే అధికారం ఈడీ, సీబీఐలకు ఉందని చెప్పిన తర్వాత, బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘55 రోజులు పరారీలో ఉన్నాడు. దాగుడు మూతలు ఆడారు. మీరు కళ్లు మూసుకుంటే ప్రపంచం చీకటిగా మారదు’’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. షాజహాన్ తరపు న్యాయవాది స్పందిస్తూ: “బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, నేను పరారీలో ఉన్నానని చెప్పారు.” అంతకుముందు విచారణలో బెంగాల్ పోలీసులు పూర్తిగా పక్షపాతంలో వ్యవహరించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
లోక్‌సభ ఎన్నికల ముందు సందేశ్‌ఖాలీ వివాదం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. మాజీ టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు అక్రమ రేషన్ కుంభకోణంలో విచారణకు వెళ్లిన ఈడీ అధికారులపై షాజహాన్ గుండాలు దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి మహిళలు దీనిపై ఉద్యమించారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని 55 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. టీఎంసీ ఇతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది.