RG Kar Ex-Principal: కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం కేసు నమోదు చేసింది.
కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత వైద్యురాలు ఆగస్టు 9 తెల్లవారుజామున 2:45 వరకు జీవించి ఉన్నట్లు సమాచారం. ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాల ద్వారా ఇది ధృవీకరించబడింది.
Howrah murder: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. చాలా వరకు కేసుల్లో భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తల్ని హతమారుస్తున్నారు. క్షణకాలం సుఖాల కోసం హత్యలకు పాల్పడటం కాకుండా, పిల్లల్ని ఒంటరివాళ్లను చేస్తు్న్నారు. తాము ఎంతో తెలివిగలవారమని భావించి పక్కా ప్లాన్‌తో హత్యలు చేస్తున్నప్పటికీ, పోలీసుల నుంచి తప్పించుకోలేమనే నిజాన్ని మరిచిపోతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని విద్యా శాఖ మూడు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలలో ఈ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపింది. ఈ క్రమంలో.. విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం తర్వాత నెమ్మదిగా ఆందోళనలు సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా అల్లరిమూకలు.. ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించడంతో తాజాగా ఈ ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
Kolkata incident : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన వార్త విన్న వారెవరికైనా కాళ్ల కింద నుంచి నేల కదులుతుంది.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ అల్లర్ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, అస్సాంలో తగ్గుతున్న హిందూ జనాభాపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు.
పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణం అందరినీ కదిలించింది. లేడీ డాక్టర్‌పై తొలుత అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు.