బెంగళూరులో నిన్న (శనివారం) భారీ వర్షం కురిసింది. రాబోయే ఐదు రోజుల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. నగరంలో అనేక ప్రదేశాలలో నీరు ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ 2 (ఆదివారం) నుండి జూన్ 4 (మంగళవారం) వరకు బెంగళూరులో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జూన్ 5, 6 తేదీల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.
Read Also: D. Sridhar Babu: అలుపెరుగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం
మరోవైపు.. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 26.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అలాగే, మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని పలు ప్రాంతాలు వచ్చే ఏడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక తెలిపింది. కేరళలోని కోజికోడ్‌లో జూన్ 2 నుండి జూన్ 8 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే ఏడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరపడతాయని తెలిపింది.
Read Also: TSRTC MD VC Sajjanar: గుడ్ న్యూస్.. త్వరలోనే టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ..
మరోవైపు తమిళనాడులోని చెన్నైలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైలో గరిష్ట ఉష్ణోగ్రత 34 నుండి 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.