తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు ఇంటీరియర్ ఒడిస్సా నుండి విదర్భా, తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ తమళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9కిమి ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణా రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని.. ఒకటి, రెండు ప్రదేశములలో ఎల్లుండి(28వ తేదీ) వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ హెచ్చరికలు:-ఇవాళ, రేపు తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో (గంటకి 30 నుండి 40 కి మి వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయని.. పశ్చిమ, మధ్య, తూర్పు తెలంగాణా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో ఎల్లుండి (28వ తేదీ)వర్షాలు ఉన్నాయని తెలిపింది వాతావరణ శాఖ.